Begin typing your search above and press return to search.

నాగార్జున కూడా ఇంత లేట్ అయితే ఎలా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేయడానికి టైం తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2025 11:30 PM GMT
నాగార్జున కూడా ఇంత లేట్ అయితే ఎలా..?
X

టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేయడానికి టైం తీసుకుంటున్నారు. ఓ పక్క కోలీవుడ్ లో కూలీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు నాగ్. దాదాపు అది నెగిటివ్ రోల్ అన్న టాక్ వినిపిస్తుంది. అయినా సరే లోకేష్ కనకరాజ్ సినిమా కాబట్టి ఆ పాత్రలో నాగార్జున ఎలా ఉంటారా అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. మరోపక్క కుబేర సినిమా కూడా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమాలో కూడా నాగార్జున కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.

ధనుష్ కుబేరల్లో కథను మలుపు తిప్పే పాత్ర కాబట్టే నాగార్జున ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఐతే తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్న నాగ్ తెలుగులో ఒక్క సినిమాను మొదలు పెట్టలేదు. నాగార్జున లాంటి సీనియర్ హీరో కూడా కథల ఎంపికలో ఇంత లేట్ చేయడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగార్జున చేస్తున్న ఈ లేట్ కి అసంతృప్తిగా ఉన్నారు.

అఖిల్ కూడా ఏజెంట్ వచ్చి రెండేళ్లు దాటినా మరో సినిమా ఊసేలేదు. నాగార్జున కూడా అదే దారిలో వెళ్తున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని అక్కినేని ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. మరోపక్క నాగ చైతన్య తండేల్ తో 100 కోట్ల సినిమా చేశాడు. తండేల్ సక్సెస్ తో అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ మొదలైంది. నాగార్జున, అఖిల్ టైం పాస్ చేస్తున్నా నాగ చైతన్య మాత్రం సినిమా వెంట సినిమా చేస్తూ వస్తున్నాడు.

నాగార్జున నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒకరిద్దరు దర్శకులతో కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తున్నా ఏది ఫైనల్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. మరి నాగార్జున నెక్స్ట్ సినిమా ఏది అవుతుంది ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది చూడాలి. నాగార్జున మాత్రం ఈసారి కూడా కొడితే సూపర్ హిట్టే కొట్టాలి అన్నట్టుగా చూస్తున్నాడు. మరి అది ఎలా సెట్ అవుతుంది అన్నది చూడాలి. నాగార్జున అఖిల్ స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేస్తే ఫ్యాన్స్ డబుల్ జోష్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.