కొడుకు కోడలితో నాగార్జున: ఫ్రేమ్ ఎంత నిండుగా ఉందంటే!
వివాహం అనంతరం నేడు శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయంలో నాగచైతన్య- శోభిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
By: Tupaki Desk | 6 Dec 2024 12:39 PM GMTవేద మంత్రాల సాక్షిగా వివాహ బంధంతో నాగచైతన్య-శోభిత ఒక్కటయ్యారు. దంపతులుగా కొత్త జీవితానికి నాంది పలికారు. ఈ పెళ్లి విషయంలో నాగార్జున ఎంతో సంతోషంగా ఉన్నారు. శోభితతో వివాహం గురించి పెళ్లికి ముందే నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఇప్పుడు శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేయడంతో ఆయన ఆనందానికి అవదుల్లేవ్. వివాహం అనంతరం నేడు శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయంలో నాగచైతన్య- శోభిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ సమయంలో వెంట నాగార్జున కూడా ఉన్నారు. దీంతో ఈ వివాహాన్ని నాగార్జున ఎంత గొప్పగా భావిస్తున్నారో తేట తెల్లమైంది. కుమారుడి సంతోషం కన్నా కన్న తండ్రికి ఏది ఇష్టం ఉండదు. అందుకే తనయుడికి తోడుగా ఆయన కూడా స్వయంగా మల్లన్న స్వామి పూజల్లో పాల్గొన్నారు. ఆయనే దగ్గరుండి మరీ నవ దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆ ఫ్రేమ్ ఎంతో అందంగా, నిండుగా ఉంది. తనయుడి విషయంలో నాగార్జున ఎంత సంతోషంగా ఉన్నారో? ఈ ఒక్క ప్రేమ్ చెప్పకనే చెబుతుంది.
ఈ పూజల కోసం శోభిత సంప్రదాయ పసుపు పట్టు చీర ధరించారు. మ్యాచింగ్ పైటంచు కాంబినేషన్ ఎరుపు వర్ణం రవిక ధరించారు. ఇక చైతన్య తెలుపు రంగు దుస్తులు, మెడలో తుండు తో మెరిసారు. ఆ పక్కనే నాగార్జున లైట్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ దుస్తుల్లో చూడొచ్చు. ఇంకా పూజ క్రతవులో భాగంగా తండ్రి తనయులిద్దరు కాషాయ రంగు తుండులు మెడలో ధరించారు.
ఈ పూజా కార్యక్రమం ప్రత్యేకంగా చైతన్య-నాగార్జున చేయాల్సిన క్రతవుగా తెలుస్తుంది. పూజా కార్యక్రమాలు ముగిం చుకున్న అనంతరం ప్రధాన అర్చకులు అక్కినేని ఫ్యామిలీతో ఫోటోలు దిగారు. అనంతరం కొడుకు కోడల్ని తీసుకుని నాగార్జున హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అక్కినేని కుటుంబ సబ్యుల్ని చూడటానికి అభిమానులు గుమి గూడారు.