బిగ్ బాస్ నాగార్జున డబుల్ డిమాండ్..!
ఇదివరకు 20 కోట్ల దాకా ఉన్న రెమ్యునరేషన్ ఈ సీజన్ కి 10 పెంచి 30 కోట్లు డిమాండ్ చేశారట.
By: Tupaki Desk | 26 July 2024 6:30 AM GMTతెలుగు బిగ్ బాస్ అంటే చాలు హోస్ట్ గా నాగార్జున పేరే కన్ ఫర్మ్ చేసేలా ఆయన సత్తా చాటుతున్నారు. సీజన్ 1 తారక్, సీజన్ 2 నాని హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. సీజన్ సీజన్ కి కంటెస్టెంట్స్ తో పాతు బిగ్ బాస్ హోస్ట్ పై కూడా రకరకాల చర్చలు జరిగేవి. కానీ సీజన్ 8 మొదలవుతున్న ఈ టైం లో కంటెస్టెంట్స్ ఎవరెవరు అని హడావిడి చేస్తున్నారు తప్ప హోస్ట్ గురించి డిస్కషన్స్ రావట్లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు.
అంతేకాదు రాబోయే సీజన్లకు మాక్సిమం నాగ్ సార్ తోనే కొనసాగించేలా బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యింది. నాగార్జున కాకుండా బిగ్ బాస్ ని హ్యాండిల్ చేయడం కాస్త కష్టమే అవుతుంది. ఎలాగు అలవాటు పడ్డాం కాబట్టి ఒక 20, 30 రోజులు డేట్స్ ఇచ్చేద్దామని నాగార్జున ఫిక్స్ అయ్యారు. ఐతే బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేస్తున్నందుకు ఒక రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇదివరకు 20 కోట్ల దాకా ఉన్న రెమ్యునరేషన్ ఈ సీజన్ కి 10 పెంచి 30 కోట్లు డిమాండ్ చేశారట.
బిగ్ బాస్ టీం కు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ సెట్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంది. దానికి ఎంతో కొంత ఛార్జ్ ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేయడం వల్ల అక్కడ నుంచి లీక్స్ బాగా వస్తున్నాయని ఈసారి బిగ్ బాస్ హౌస్ ని మార్చేయాలని అనుకున్నారు. కానీ ఈ సీజన్ వరకు అక్కడే ఉండి.. లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు.
సో స్టూడియోకి రెంట్ ప్లస్ తన రెమ్యునరేషన్ ఇలా రెండు విధాలుగా నాగార్జున లాభపడుతున్నారు. కేవలం రెమ్యూనరేషన్ కోసమే 30 కోట్లు అడుగుతున్నట్టు తెలుస్తుండగా స్టూడియో రెంట్ కోసం ఎంత డిమాండ్ చేస్తున్నారన్నది బయటకు రాలేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీస్, బుల్లితెర యాంకర్లు, సీరియల్ స్టార్స్ ఇలా వీరితోనే షో నడిపించాలని అనుకుంటున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి రకరకాలుగా అనుకుంటుండగా వాళ్లు ఎవరెవరు అనేది షో మొదలైన రోజు తెలుస్తుంది.