సంక్రాంతి 2025 .. స్నేహితుల మధ్య వార్
2024 సంక్రాంతి కింగ్ నాగార్జునకు మంచి కిక్కిచ్చింది. ఆయన నటించిన నా సామి రంగ మంచి సమీక్షలతో బాక్సాఫీస్ వద్ద రాణించింది
By: Tupaki Desk | 29 Jan 2024 4:20 AM GMT2024 సంక్రాంతి కింగ్ నాగార్జునకు మంచి కిక్కిచ్చింది. ఆయన నటించిన నా సామి రంగ మంచి సమీక్షలతో బాక్సాఫీస్ వద్ద రాణించింది. ఇక ఇదే హుషారులో సక్సెస్ మీట్ లో ఆయన చేసిన ఒక కామెంట్ చాలా సమీకరణాలకు తావిచ్చింది. వచ్చే సంక్రాంతికి కలుద్దాం! అంటూ నాగార్జున చేసన వ్యాఖ్యతో అతడు నటించిన సినిమాని వచ్చే సంక్రాంతి బరిలో తీసుకుని వస్తున్నారని క్లారిటీ వచ్చేసూఇంది.
నిజానికి 2022లో కింగ్ అక్కినేని నాగార్జున వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి వార్ కొనసాగింది. కానీ విచారకరంగా వీరు నటించిన రెండు చిత్రాలు ది ఘోస్ట్ - గాడ్ ఫాదర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు వారు పునరుజ్జీవనం కోసం సిద్ధంగా ఉన్నారు. 2025 సంక్రాంతి సందర్భంగా మరోసారి ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నారు.
నా సామి రంగ విజయోత్సవ వేడుకల సందర్భంగా, నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్‌పై సూచనలను అందించాడు. ''వచ్చే సంక్రాంతికి కలుద్దాం'' అని మోస్ట్ అవైటెడ్ బంగార్రాజు 2 గురించి ప్రస్తావించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి -విశ్వంభర సంక్రాంతి 2025 విడుదలను ఇప్పటికే అధికారికంగా ఖాయం చేసుకుంది. దీంతో ఇరువురు మంచి స్నేహితుల నడుమ వార్ షురూ అయింది. వారి బలమైన ఆఫ్‌లైన్ స్నేహబంధం తో సంబంధం లేకుండా వచ్చే సంక్రాంతికి జరగనున్న స్నేహపూర్వక ఘర్షణ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అంతేకాదు.. వచ్చే సంక్రాంతి రేసులోకి అనూహ్యంగా 'శతమానం భవతి 2' కూడా రానుందని టాక్ ఉంది. శర్వానంద్ - దిల్ రాజు కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. చూస్తుంటే వచ్చే సంక్రాంతి రేసులోకి ఇంకా చాలా సినిమాలు చేరతాయని అర్థమవుతోంది.