Begin typing your search above and press return to search.

ఆ హీరో కోసం మరోసారి నాగ్!

కింగ్ నాగార్జున ఓ వైపు హీరోగా చేస్తూనే తన హోం బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 6:42 AM GMT
ఆ హీరో కోసం మరోసారి నాగ్!
X

కింగ్ నాగార్జున ఓ వైపు హీరోగా చేస్తూనే తన హోం బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. అలాగే డబ్బింగ్ సినిమాలని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా మూవీస్ నిర్మించకపోయిన నాగార్జున మాత్రం అప్పుడప్పుడు బ్యానర్ నుంచి మినిమమ్ బడ్జెట్ మూవీస్ ని వాడులుతూనే ఉన్నారు.

తమిళ్ హీరో కార్తి నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు. అప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీతో కార్తి మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో కార్తి సర్దార్ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో నాగార్జునకి మంచి లాభాలు వచ్చాయి.

మరల కార్తి కొత్త మూవీ జపాన్ కూడా తెలుగు రిలీజ్ రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్ లో పీరియాడిక్ జోనర్ లో కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా జపాన్ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఈ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 200 కోట్లు దోపిడీ చేసిన ఓ క్రేజీ దొంగ పాత్రలో కార్తి ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. అతని లుక్, ఆహార్యం అంతా కూడా చాలా వెరైటీగా ఉంది. ఒళ్లంతా బంగారం వేసుకొని దొంగతనం చేసే సొమ్ముతో జల్సాలు చేసే వాడిగా కార్తి నటించినట్లు తెలుస్తోంది. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

అనూ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కార్తి మీద అభిమానంతోనే జపాన్ తెలుగు రిలీజ్ రైట్స్ ని కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సర్దార్ తరహాలో జపాన్ కూడా కింగ్ నాగార్జునకి లాభాలు తీసుకొస్తుందేమో చూడాలి. కెరియర్ ఆరంభంలోనే స్టార్స్ తో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్ కి కూడా జపాన్ హిట్ చాలా అవసరం. జపాన్ తర్వాత కార్తి స్ట్రైట్ తెలుగు మూవీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.