Begin typing your search above and press return to search.

మ‌రోసారి నాగార్జున ఆ అవ‌తారం ఎత్త‌బోత్తున్నారా?

ఇందులో నాగార్జున ఓకీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ ఆ పాత్ర ఎలా ఉంటుందన్న‌ది మాత్రం ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 11:30 AM GMT
మ‌రోసారి నాగార్జున ఆ అవ‌తారం ఎత్త‌బోత్తున్నారా?
X

మ‌రోసారి కింగ్ నాగార్జున డాన్ అవ‌తారం ఎత్త‌బోత్తున్నారా? ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని ఏలే అధినాయ‌కుడిగా తెర‌పై క‌నిపించ‌బోతున్నారా? క‌నిపించేది కాసేపు పాత్రైనా కింగ్ కెరీర్ లోనే గుర్తుడిపో యేలా పాత్ర ఉండ‌బోతుందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ క‌థ‌నాయ‌కుడిగా శేఖ‌ర్ క‌మ్ములా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో నాగార్జున ఓకీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ ఆ పాత్ర ఎలా ఉంటుందన్న‌ది మాత్రం ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. ఒకానొక ద‌శ‌లో ఈ పాత్ర ధ‌నుష్ కి పోటీగా ఉండే పాజిటివ్ రోల్ అని ప్ర‌చారం సాగింది. ధ‌నుష్ హీరో అయితే నాగార్జున కాస్త నెగిటివ్ షేడ్ ఉండే రోల్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే ఇటీవ‌లే ఇది ముంబై మాఫియా స్టోరీ అని రివీల్ అవ్వ‌డంతో! నాగార్జున ఆ రెండు పాత్ర‌ల‌కంటే భిన్నంగా..ఛాలెంజింగ్ గా డిజైన్ చేస్తున్న‌ట్లు లీకులంద‌తున్నాయి.

ఏకంగా ముంబై మాఫియాని శాషించే డాన్ పాత్ర‌లో కింగ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోం ది. ఇది సినిమాలో ధ‌నుష్ కి గురువు పాత్ర‌లా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ పాత్ర‌ని చాలా వైవిథ్యంగా క‌మ్ములా సిద్దం చేసిన‌ట్లు ఉప్పందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌పై చూసిన డాన్ పాత్ర‌ల‌కు భిన్నంగా.. స‌రికొత్త‌గా ఆవిష్క‌రించ‌బోతున్నారుట‌. మ‌రి ఆ రోల్ వైవిథ్య‌త ఎలా ఉంటుందో చూడాలి.

ఇక డాన్ పాత్ర పోషించ‌డం నాగార్జున కు కొత్తేం కాదు. లారెన్స్ తెర‌కెక్కించిన డాన్స్ సినిమాలో ముంబై మాఫియా డాన్ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. డాన్ పాత్ర పోషించ‌డం నాగార్జున కెరీర్ లో అదే తొలిసారి. మ‌ళ్లీ ఇంత కాలానికి క‌మ్ములా చిత్రం ద్వారా ఆ ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు తె లుస్తోంది. అయితే ఇందులో వాస్త‌వం ఏంత‌? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.