Begin typing your search above and press return to search.

నాగార్జునను అన్న అనేసిన పూజా హెగ్డే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజా హెగ్డే. ఈ మధ్యే కాస్త ఈ బ్యూటీ జోరు తగ్గింది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 12:14 PM GMT
నాగార్జునను అన్న అనేసిన పూజా హెగ్డే..!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజా హెగ్డే. ఈ మధ్యే కాస్త ఈ బ్యూటీ జోరు తగ్గింది. కానీ, మొన్నటి వరకు దాదాపు అందరు స్టార్ హీరోల పక్కన నటించింది. సినిమాలు తగ్గడంతో అందరూ పూజ పని అయిపోయింది అనుకున్నారు. కానీ పూజ, ప్రకటనలతో బిజీ అవుతోంది. తాజాగా ఆమె మాజా ప్రకటనలో నటించింది.

ఈ ప్రకటనలో ఆమెతో పాటు, కింగ్ నాగార్జున కూడా కనిపించడం విశేషం. అయితే, దీనిలో నాగార్జునను పూజా అన్నయ్య అని పిలవడం హైలెట్. నాగ్ ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరితోనూ హీరోయిన్ గా నటించిన పూజ, చివరకు నాగ్ ని అన్నయ్య అని పిలవడం ఇప్పుడు విశేషం. ఆ ప్రకటన ప్రకారం వారంతా ఫ్యామిలీ. నాగార్జున తన శివ సినిమాలోని పాటలను హమ్ చేస్తూ ఉంటాడు.

ఆ పాటకు ఇంట్లోని సభ్యులంతా సింక్ అయ్యి హమ్ చేస్తూ ఉంటే, నాన్ సింక్ లో వచ్చి పూజ పాట దారుణంగా పాడుతుంది. ఆమె పాటకు అందరూ షాకౌతారు. కానీ, నాగ్ మాత్రం పాట బాగా పాడకపోయినా డ్యాన్స్ బాగా వేస్తుంది కదా అమ్మూ అని సపోర్ట్ చేస్తాడు. వెంటనే అన్నయ్య అని పిలుస్తుంది. అందరూ సరదాగా నవ్వేస్తారు. ఇప్పుడు ఈ యాడ్ వైరల్ గా మారింది.

ఈ వీడియోని సోషల్ మీడియాలో పూజ నే షేర్ చేసింది.‘ కుటుంబంలో అందరినీ అంగీకరించడం కూడా ఔదార్యమే’ అంటూ క్యాప్షన్ పెట్టింది. మాజా కుటుంబాన్ని ఒకటి చేస్తుంది అంటూ, మాజా తాగిద్దాం, అందరికీ చేరువౌదాం అంటూ క్యాప్షన్ లో పేర్కొంది. కాగా, ఈ వీడియోకి నెటిజన్లు, లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కువ నాగ్ మీదే కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున ఏజ్ పెరగడం ఆగిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, పూజ అందంగా ఉంది. ఈ వీడియోలో నాగ్ లుక్ చాలా మెస్సీ గా ఉంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం పూజ కొత్తగా ఏ సినిమా అంగీకరించడం విశేషం.