రూ.1.82 లక్షలు.. బిబి నాగ్ రేంజ్ ఇది
తాజాగా బిగ్బాస్ షో కోసం నాగార్జున ధరించిన స్వెట్ షర్ట్ ని సామాన్యులు మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి వారు కూడా కొనుగోలు చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.
By: Tupaki Desk | 28 Nov 2023 5:21 AM GMTసినిమాల్లో స్టార్స్ ధరించే ఔట్ ఫిట్ లపై వారి అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక హీరో ఏదైనా సినిమాలో ఒకే తరహా ఔట్ ఫిట్ ను లేదా డిఫరెంట్ ఔట్ ఫిట్ ను ట్రై చేస్తే ఆయన అభిమానులు వాటిని ఫాలో అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే హీరోలు ధరించే ఔట్ ఫిట్స్ ధర సామాన్యులు ఖర్చు పెట్టలేనంత ఉంటుంది.
తాజాగా బిగ్బాస్ షో కోసం నాగార్జున ధరించిన స్వెట్ షర్ట్ ని సామాన్యులు మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి వారు కూడా కొనుగోలు చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. కోటీశ్వరులు మాత్రమే ఆ బ్రాండ్ ని అందుకోగలరు, ఆ తరహా స్వెట్ షర్ట్ ను ధరించగలరు. ఇంతకు నాగ్ సర్ ధరించిన ఆ స్వెట్ షర్ట్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.82 లక్షలు.
బిగ్బాస్ తాజా వీకెండ్ ఎపిసోడ్ కోసం ఈ విభిన్నమైన ఔట్ ఫిట్ ను నాగార్జున ట్రై చేశాడు. స్వచ్చమైన కాశ్మీరీ ఉన్నితో ప్రపంచ ప్రసిద్ది గాంచిన లూయిస్ విట్టన్ బ్రాండ్ వారు ఈ స్వెట్ షర్ట్ ను తయారు చేశారు. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అయిన లూయిస్ వారి ఉత్పత్తులు అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు ఉంది. నాగ్ ధరించిన ఈ స్వెట్ షర్ట్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది.
నాగ్ ఏ ఔట్ ఫిట్ లో అయినా చాలా స్టైల్ గా కనిపిస్తారు, ఈ షర్ట్ లో అంతకు మించి అన్నట్లుగా అందంగా ఉన్నారు అంటూ ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభంలో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సర్ మీ షర్ట్ చాలా బాగుంది అన్నారు. మొత్తానికి నాగ్ తన ఔట్ ఫిట్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇక నాగ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి నా సామిరంగ సినిమా ను షూట్ చేస్తున్నారు. మరో రెండు వారాల్లో షూటింగ్ ను ముగించే విధంగా జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆషికా రంగనాథన్ మరియు మిర్నా మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా విజయ్ బన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు.