Begin typing your search above and press return to search.

ఈ హీరో సోష‌ల్ మీడియా చూడ‌డా?

తాను స‌హ‌జీవ‌నంలో ఉన్న ప‌విత్ర గౌడ‌కు అస‌భ్య సందేశాలు పంపాడ‌న్న కార‌ణంతో రేణుక‌స్వామిని ద‌ర్శ‌న్ హ‌త్య చేయించిన‌ట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

By:  Tupaki Desk   |   29 Jun 2024 4:23 AM GMT
ఈ హీరో సోష‌ల్ మీడియా చూడ‌డా?
X

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డైన ద‌ర్శ‌న్.. త‌న అభిమానే అయిన రేణుక స్వామిని హ‌త్య చేయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ అరెస్ట్ కావ‌డం కొన్ని రోజులుగా ఎంత‌టి సంచ‌ల‌నం రేపుతోందో తెలిసిందే. తాను స‌హ‌జీవ‌నంలో ఉన్న ప‌విత్ర గౌడ‌కు అస‌భ్య సందేశాలు పంపాడ‌న్న కార‌ణంతో రేణుక‌స్వామిని ద‌ర్శ‌న్ హ‌త్య చేయించిన‌ట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. రేణుక స్వామిని తీవ్రాతి తీవ్రంగా హింసించాక అత‌ణ్ని హ‌త్య చేసిన‌ట్లు వెల్ల‌డి కావ‌డం.. అత‌డి ఒంటి మీద ఉన్న తీవ్ర గాయాలు చూశాక సోష‌ల్ మీడియా జ‌నాల గుండెలు మండిపోయాయి.

క‌న్న‌డ ఇండ‌స్ట్రీతో మ‌న‌కు ఏ క‌నెక్ష‌న్ లేక‌పోయినా.. ద‌ర్శ‌న్ మీద మ‌న అభిమానులు తీవ్రస్థాయిలో స్పందించారు. అత‌డికి వ్య‌తిరేకంగా ట్రెండ్ చేశారు. త‌న‌కు శిక్ష ప‌డాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ద‌ర్శ‌న్ అభిమానులు వారి మీద ఎదురుదాడి చేశారు. మ‌న స్టార్ హీరోల‌ను ట్రోల్ చేశారు. కొన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొన‌సాగింది. వారం రోజులుగా ఈ వ్య‌వ‌హారం న‌డుస్తుండ‌గా.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ద‌ర్శ‌న్‌కు మద్ద‌తుగా పోస్ట్ పెట్టి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. ద‌ర్శ‌న్ విష‌యంలో ఒక అంచ‌నాకు రావ‌ద్దు అని అంటూనే అత‌ను నిర్దోషిగా బ‌య‌టికి వ‌స్తాడంటూ అత‌ను ఒక అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ దెబ్బ‌తో నాగ‌శౌర్య తెలుగు సోష‌ల్ మీడియాకు టార్గెట్ అయిపోయాడు. ఓవైపు ద‌ర్శ‌న్‌ను వ్య‌తిరేకిస్తూ అత‌డి అభిమానుల‌తో తాము గొడ‌వప‌డుతుంటే.. టాలీవుడ్ నుంచి ఏ సంబంధం లేని హీరో ఇలా ద‌ర్శ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం వారికి అస్స‌లు రుచించ‌డం లేదు. కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ఏం న‌డుస్తోందో అస‌లు శౌర్య‌కు అవగాహ‌న లేదా అని ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. శౌర్య‌కు మ‌ద్ద‌తుగా ఎవ్వ‌రూ మాట్లాడ‌ట్లేదు. అంద‌రూ అత‌ణ్ని త‌ప్పుబ‌డుతున్న‌వారే. గ‌తంలో కొన్ని వివాదాల‌తో నాగ‌శౌర్య సోష‌ల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు తాజా వ్య‌వ‌హారంతో అత‌ను మ‌రింత చెడ్డ‌పేరు తెచ్చుకున్నాడు. ఇది అత‌డి సినిమాల మీద ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డేలాచేస్తుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.