Begin typing your search above and press return to search.

నాగ శౌర్య.. ఏం చేస్తున్నాడు?

కొద్ది రోజుల క్రితం.. శౌర్య హీరోగా స్టార్ట్ అయిన ఒక మూవీ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   22 July 2024 2:33 AM GMT
నాగ శౌర్య.. ఏం చేస్తున్నాడు?
X

యువ కథానాయకుడు నాగ శౌర్య.. టాలీవుడ్ గుడ్ లుకింగ్ హీరోస్ లిస్ట్ లో పక్కాగా ముందువరుసలో అంటారు. ఎంతో మంది అమ్మాయిలకు ఆయన క్రష్ అనే చెప్పాలి. శౌర్యకు లేడీ ఫ్యాన్స్ బాగా ఎక్కువే. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలతో అలరించిన నాగ శౌర్య.. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. సరైన హిట్ కొట్టి కూడా చాలా కాలమైంది. గతేడాది రెండు సినిమాలతో వచ్చిన యంగ్ హీరో.. 2024లో ఆయన నటించిన ఒక్క మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

చివరగా రంగబలి సినిమాతో థియేటర్లలోకి వచ్చిన శౌర్య.. డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఫస్టాప్ బాగానే ఉన్నా.. సెకండాఫ్ మాత్రం విఫలమైంది. సినిమా రిజల్ట్ దారుణంగా ఉన్నా.. మీడియాతో ఆయన మాట్లాడిన తీరుతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల హత్య కేసులో అరెస్టు అయిన కన్నడ యాక్టర్ దర్శన్ కు మద్దతుగా పోస్ట్ పెట్టి మరింత విమర్శలపాలయ్యారు. హత్య కేసు నిందితుడికి సపోర్ట్ ఎలా చేశారని గట్టిగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు.

అయితే వరుస సినిమాలతో ఫ్లాపులు ఎదుర్కొన్న నాగ శౌర్య.. కొత్త మూవీకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం.. శౌర్య హీరోగా స్టార్ట్ అయిన ఒక మూవీ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ద‌ర్శ‌కుడికి, నిర్మాతకు మ‌ధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆ సినిమా రద్దు అయినట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు మరో మూవీ విషయంలో కూడా అలానే జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఓ ఎన్నారై ప్రొడక్షన్ లో మూవీ స్టార్ట్ చేశారు నాగ శౌర్య. ఆ సినిమాతో అరుణాచలం అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్ ను సెలెక్ట్ చేసుకున్నారు. మ్యూజిక్ వర్క్స్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయి. సుమారు రెండు వారాల పాటు మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

అయితే మూవీ పెద్ద షెడ్యూల్ మొదలుకాకముందే.. కోట్లు ఖర్చు అయిందట. ఇంకా పూర్తి స్థాయిలో చిత్రీకరణ మొదలైతే భారీ వ్యయం అవుద్దని అంచనా వేశారట. దీంతో నిర్మాత భయపడి.. డ్రాప్ అయ్యారని తెలుస్తోంది. దానికి తోడు నాగ శౌర్య హిట్ కొట్టి చాలా గ్యాప్ వచ్చింది. అందుకే తన బదులు వేరొక నిర్మాతను చూసుకోవాలని చెప్పేశారని సమాచారం. ఇప్పటికే ఖర్చు అయిన బడ్జెట్ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయిస్తారని వినికిడి. మరి ఈ చిత్రం విషయంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.