నాగ్ అశ్విన్.. ఇచ్చి పడేశాడు..
టైటిల్ ని రిలీజ్ చేసి ఒక్కసారిగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారని చెప్పాలి
By: Tupaki Desk | 21 July 2023 8:52 AM GMTటాలీవుడ్ లో ప్రతి జనరేషన్ లో కూడా కొంతమంది టాలెంటెడ్ దర్శకులు తమ అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.అందరూ ఒక మార్గంలో వెళ్తే తాము ప్రత్యేకంగా మరో మార్గాన్ని సృష్టించుకుంటారు. కథల ఎంపికలో, వాటిని తెరపై ఆవిష్కరించడం ద్వారా ప్రత్యేకమైన శైలిని చూపిస్తూ క్రియేటివ్ దర్శకులుగా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నాగ్ అశ్విన్ కూడా వచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మహానటి సావిత్రి జీవిత కథను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం తోపాటు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే మహానటి సినిమా తెరకెక్కింది. దీని తర్వాత ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్ Project K వర్కింగ్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేశారు. ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. దీపికా పదుకునే, అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ని ఈ చిత్రం కోసం ఎంపిక చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా చర్చకి తెరతీశారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమా టైటిల్, గ్లింప్స్ కి ఒక్క రోజు ముందు రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ చాలా నాసిరకంగా ఉందని, మార్ఫింగ్ ఫోటోలా ఉందనే విమర్శలు వచ్చాయి. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కూడా ఫస్ట్ లుక్ చూసి నిరాశ పడ్డారు.
అయితే వారి అంచనాలని తలక్రిందులు చేస్తూ Project K గ్లింప్స్, టైటిల్ ని రిలీజ్ చేసి ఒక్కసారిగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారని చెప్పాలి. Kalki 2898 AD అని సినిమాకి టైటిల్ గా ఫిక్స్ చేశారు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నెవ్వర్ బిఫోర్ అనే విధంగా అద్భుతమైన విజువల్స్ తో గ్లింప్స్, టైటిల్ ఆవిష్కరించారు. అస్సలు అంచనాలకి అందకుండా సరికొత్తగా తనని తాను రిప్రజెంట్ చేసుకోవడంలో నాగ్ అశ్విన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని ఈ మూవీ గ్లింప్స్ తో రుజువైంది. రాజమౌళి తర్వాత టాలీవుడ్ నుంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించే సత్తా ఉన్న దర్శకుడుగా నాగ్ అశ్విన్ ఈ సినిమాతో నిరూపించుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.