Begin typing your search above and press return to search.

కల్కి-2.. నిర్మాత అలా, డైరెక్టర్ ఇలా!

ఇటీవల 'కల్కి 2898 ఏడీ' నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. సెకండ్ పార్ట్ కు సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు.

By:  Tupaki Desk   |   6 July 2024 12:40 PM GMT
కల్కి-2.. నిర్మాత అలా, డైరెక్టర్ ఇలా!
X

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన 'కల్కి 2989 AD' సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెకండ్ వీక్ లోనూ భారీ వసూళ్లను రాబడుతూ 1000 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్ తో కల్కి సినిమాటిక్ యూనివర్స్ పై అందరిలో అంచనాలు పెంచేశారు. దీంతో పార్ట్-2 ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.. అయితే 'కల్కి 2' విషయంలో దర్శక నిర్మాతలు పరస్పరం విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల 'కల్కి 2898 ఏడీ' నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. సెకండ్ పార్ట్ కు సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. 3000 ఫీట్ పుటేజీ రెడీగా ఉందని, కొన్ని ముఖ్యమైన పోర్షన్స్ షూటింగ్ జరగాల్సి ఉందని వెల్లడించారు. 'కల్కి 2' ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదంటూనే, వచ్చే ఏడాది ఈ టైంలోనే రావొచ్చని అన్నారు. మరో ఇంటర్వ్యూలో మాత్రం 2025 సెప్టెంబర్ అక్టోబర్ లలో వస్తామని, కానీ ఇంకా దాని గురించి తాము మాట్లాడుకోలేదని చెప్పారు. అంతేకాదు ఈ ఇయర్ ఎండింగ్ లో పార్ట్ 2 షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

అయితే నిన్న మీడియా ఇంటరాక్షన్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ దానికి పూర్తిగా విరుద్ధమైన ప్రకటన చేశారు. 'అసలు కల్కి పార్ట్-2 షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు.. అప్పుడే మీరు రిలీజ్ గురించి అడుగుతున్నారు' అని నవ్వుతూ అన్నారు. స్టోరీని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, చాలా ఐడియాలు ఉన్నాయని, షూటింగ్‌కు సమయం పడుతుందని సూచించారు నాగి. ఇలా 'కల్కి 2898 AD' సీక్వెల్ పై దర్శక నిర్మాతలు వేర్వేరు ప్రకటనలు చేయడం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. మారుతితో 'ది రాజా సాబ్'.. సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్'.. హను రాఘవూడి మైత్రీ సినిమాలకు కమిట్ అయ్యారు. దీంతో పాటుగా 'సలార్ 2' ఉందనే ఉంది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే. ఈ కమిట్‌మెంట్‌లు చూస్తుంటే, అశ్వినీదత్ చెప్పినట్లు వచ్చే ఏడాది ఇదే సమయానికి 'కల్కి 2' రెడీ అవ్వడం కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పినదాన్ని బట్టి చూస్తే, పార్ట్-2 ఇప్పుడప్పుడే రాదనే సందేహాలు లేవనెత్తుతోంది.

నిజానికి ఇటీవలి కాలంలో పెద్ద హీరోల సినిమాలేవీ చెప్పిన సమయానికి రావడం లేదు. రాజమౌళి మాత్రమే కాదు, మిగతా దర్శకులు కూడా అనుకున్న టైంకి ఫస్ట్ కాపీని రెడీ చేసి ఇవ్వలేకపోతున్నారు. 'పుష్ప-1' వచ్చిన ఏడాదిలోపే 'పుష్ప 2' రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టుకు రావాల్సిన సినిమాని డిసెంబర్ కు వాయిదా వేశారు.

అలానే గతేడాది డిసెంబర్ లో 'సలార్' ఫస్ట్ పార్ట్ వచ్చింది. సినిమా విడుదలై ఆరు నెలలు గడిచినా ఇంతవరకూ పార్ట్-2 సెట్స్ మీదకి వెళ్ళలేదు. దీన్ని బట్టి చూస్తే భారీ కాస్టింగ్, భారీ కాన్వాస్ లో తీసే 'కల్కి 2' లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో అనే సందేహాలు రాకమానవు. అందులోనూ 'కల్కి' పార్ట్-1 ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నాగ్ అశ్విన్ మూడేళ్ళకు పైగా సమయం తీసుకున్నారు. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే ఇంకెన్నేళ్ళు టైం తీసుకుంటారో చెప్పడం కష్టమే.