Begin typing your search above and press return to search.

నాగి ఆ క్యారెక్టర్లను ఎక్కడి నుంచి తీసుకున్నారో?

మరి వీరందరి పాత్రలను ఎక్కడ నుంచి నాగ్ అశ్విన్ రిఫరెన్స్ గా తీసుకున్నారో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగితే చాలు!

By:  Tupaki Desk   |   24 Jun 2024 1:30 PM GMT
నాగి ఆ క్యారెక్టర్లను ఎక్కడి నుంచి తీసుకున్నారో?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మూవీ.. మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీ కోసం బాలీవుడ్ టూ మాలీవుడ్.. అన్ని సినీ ఇండస్ట్రీల యాక్టర్స్ ను మేకర్స్ రంగంలోకి దించినట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, శోభన, పశుపతి సహా అనేక మంది నటిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ ను పురాణాల నుంచి తీసుకున్నట్లు నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పారు. అయితే నాగి.. ఏ రోల్ ఎక్కడ నుంచి తీసుకుని అంటారు? ఆయా పాత్ర వెనుక పురాణ గాథ ఏమై ఉంటుంది? వంటి పలు అంశాలు మీకోసం.

ముందుగా మనం ప్రభాస్ రోల్ గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో బౌంటీ హంటర్ భైరవ పాత్రను ప్రభాస్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. పురాణాల ప్రకారం భైరవుడు శివుని అంశతో పుట్టినవాడు. బ్రహ్మకు ఐదు తలలు ఉన్నాయనే అహంకారంగా ఓ సారి తన కాళ్లకు దండం పెట్టమని శివుడిని అడుగుతాడు. అప్పుడు భైరవుడు.. శివుని అంశంతో పుట్టి బ్రహ్మ ఐదో తలను గిల్లుతాడు. ఆ తర్వాత బ్రహ్మ ఐదో తల భైరవుడి చేతికి ఉండిపోగా.. కాశీకి వెళ్లాక ఊడిపడుతుంది. అప్పుడు కాశీ విశ్వనాథుడు భైరవుడిని తన ప్రాంతానికి క్షేత్రపాలకుడిగా నియమిస్తాడు. అలా కాశీలో అందరికీ భైరవుడు పరిచయమే. ఆ భైరవుడు స్ఫూర్తితోనే నాగి ప్రభాస్ క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర అయిన అశ్వత్థామ రోల్ లో అమితాబ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ట్రైలర్ లో భైరవ, అశ్వత్థామ మధ్య యుద్ధ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. అయితే పురాణాల ప్రకారం మహాభారతంలో అశ్వత్థామ అత్యంత శక్తిమంతుడు. ఆయన మరణం ఉండదు. ఆకలి కూడా ఉంది. కానీ కృష్ణుడు వేసిన శాపం వల్ల అనేక రోగాలతో కలియుగం అంతమయ్యే వరకు ఉంటాడు. ప్రమోషనల్ కంటెంట్ లో దీపిక గర్భాన్ని అశ్వత్థామ కాపాడుతున్నట్టు చూపించారు మేకర్స్. అయితే విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తిన సమయంలో అశ్వత్థామ ఏ విధంగా సహాయం చేశారో ఊహించుకుని నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర కోసం అంతా చర్చ నడిచింది. అంతలా ఆయన గెటప్ ఆకట్టుకుంది. అశ్వత్థామ, భైరవుడు పాత్రలను ఈజీగా మనం ఊహించుకోగలం కానీ.. యాస్కిన్ పదమే ఎప్పుడూ విని ఉండం. ఎక్కడ నుంచి నాగ్ అశ్విన్ తీసుకున్నారో కూడా తెలియడం లేదు. కానీ యాస్కిన్ తో భైరవ పోరాటం చేయనున్నారని అర్థమవుతుంది. అయితే సినిమాలో కలి రోల్ కూడా కమల్ చేశారని వార్తలు వస్తున్నాయి. పురాణాల ప్రకారం కలి.. మనిషి అతి సుఖాల కోసం వెంపర్లాడితే పట్టి పీడిస్తూ ఉంటాడు. సినిమాలో భైరవ కూడా కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు ఏ పని చేసేందుకు వెనుకాడడు. మరేం జరుగుతుందో సినిమా చూసే తెలుసుకోవాలి.

ఇక బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సినిమాలో గర్భిణీ సమ్-80 పాత్ర పోషిస్తుండగా.. కల్కికి ఆమె జన్మనివ్వబోతుందని ట్రైలర్స్ ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం.. శంభల గ్రామానికి చెందిన విష్ణు యశుడు సతీమణి సుమతి కడుపులో కల్కి పుడతాడు. అందుకే మేకర్స్ సుమతి బదులు దీపిక రోల్ కు సమ్-80 అని పేరు పెట్టినట్లు అర్థమవుతోంది. సినిమాలో ఉత్తరగా నటిస్తున్న మాలీవుడ్ బ్యూటీ మాళవిక నాయర్‌ రోల్ ను మహాభారతం నుంచి తీసుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. భారతంలో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భాన్ని అశ్వత్థామ విచ్ఛితి చేస్తాడు. ట్రైలర్ లో ఆ సీన్ ను కూడా చూపించారు మేకర్స్.

వీరితోపాటు సినిమాలో అనేక మంది కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. రోక్సీగా దిశా పటానీ, మరియంగా శోభన, వీరెన్ గా పశుపతి, కాంప్లెక్స్‌ కమాండర్‌ మానస్‌ గా స్వాస్థ్‌ ఛటర్జీ, ఇంటి ఓనర్ గా బ్రహ్మానందం, శంబల రెబల్ ఆర్మీ సభ్యురాలుగా అనా బెన్‌ కనిపించనున్నారు. వీరే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ, మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్, బ్యూటీ మృణాల్ ఠాకూర్‌, డైరెక్టర్లు రాజమౌళి, ఆర్జీవీ గెస్ట్ రోల్స్ లో సందడి చేయనున్నట్లు టాక్. మరి వీరందరి పాత్రలను ఎక్కడ నుంచి నాగ్ అశ్విన్ రిఫరెన్స్ గా తీసుకున్నారో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగితే చాలు!