మెగాస్టార్ తో నాగ్ అశ్విన్ అతి పెద్ద అద్భుతం!
యంగ్ మేకర్ నాగ్ అశ్విన్ పేరిప్పుడు ఓ సంచలనం. పాన్ ఇండియాలో అతడి పేరు ఓ రేంజ్ మారుమ్రోగిపోతుంది
By: Tupaki Desk | 30 Jun 2024 2:30 PM GMTయంగ్ మేకర్ నాగ్ అశ్విన్ పేరిప్పుడు ఓ సంచలనం. పాన్ ఇండియాలో అతడి పేరు ఓ రేంజ్ మారుమ్రోగిపోతుంది. `కల్కి 2898` విజయంతో అతడిలో ఇంత గొప్ప ట్యాలెంట్ ఉందా? అంతటి మేథస్సు అతడి సొంతమా? అంటూ దేశమంతా మాట్లాడుకుంటుంది. తొలుత ఈ కథని చరిత్ర పుట్టల్లోకి వెళ్లి నేటి తరానికి అన్వయించి తీస్తున్నాను అని ప్రకటించగానే ఎన్నో రకాల సందేహాలు మొదలయ్యాయి.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని ఎంతవరకూ ఎగ్జిక్యూట్ చేయగలడు? అతడి అనుభవం సరిపోతుందా? లేదా? అని లక్ష సందేహాలు తెరపైకి వచ్చాయి. కానీ అన్నింటికి కల్కీ రిజల్ట్ ఒక్కటే సమాధానంగా నిలిచింది. రాజమౌ ళిని మించిపోయాడు? అన్న ప్రశంస సైతం అందుకుంటున్నాడు. నాగ్ అశ్విన్ లో ప్రతిభని మెగాస్టార్ చిరంజీవి ముందే గుర్తించారు. అతడు `మహానటి` సావిత్రి సినిమా తీసిన విధానం చూసి నేరుగా ఇంటికి పిలిపించి మరీ సన్మానం చేసారు.
ఆ సమయంలో పాతాళభైరవి లాంటి మాయలు, మరాఠీలు ఉండే సినిమాలు చేయాలని ఉంది అన్న కోర్కేను నాగ్ అశ్విన్ ముందు ఉంచారు. ఎప్పటి నుంచి చిరుకున్న కలగా చెప్పుకొచ్చారు. అందుకు నాగ్ అశ్విన్ కూడా ఆనాడే పాజిటివ్ గా స్పందించాడు. ఆ తర్వాత అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథ రాస్తున్నాడనే విషయం బయటకు రావడంతో అది చిరంజీవి కోసమేనని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ కొన్ని రోజులకు అది ప్రభాస్ కోసమనే తేలడంతో అంతా కామ్ అయ్యారు.
అయితే తాజాగా కల్కి విజయంతో చిరు కల కూడా నెరవేర డానికి ఎంతో సమయం పట్టే అవకాశం లేదనిపిస్తుంది. మెగాస్టార్ అనుకున్న కథని అద్భుతంగా రాయగల సమర్దుడు నాగ్ అశ్విన్. పురాణ ఇతిహాసాలపై ఎలాంటి పట్టు ఉందో కల్కి చూసి చెప్పొచ్చు. పాత కథలు, నవలలుపైనా అశ్విన్ కి చదివిన నాలెడ్డ్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంది. అశ్విన్ సంకల్పిస్తే వాటన్నింటితో చిరు అనుకున్నట్లు మంచి కథను సిద్దం చేయగలడు. స్టోరీ సిద్దంగా ఉండేలా గానీ చిరు దూసుకొచ్చేయరు. ఇది జరగాలని మెగా అభిమానులు అంతే ఆశిస్తున్నారు. కానీ ఇదంతా నాగ్ అశ్విన్ చేతుల్లోనే ఉంది.