Begin typing your search above and press return to search.

బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్న కల్కి మూవీలో నాగ్ అశ్విని‌కు ప్రత్యేకమైన ఆ రెండు సన్నివేశాలు..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సత్తా చాటుతూ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తున్న చిత్రం కల్కి 2898 AD.

By:  Tupaki Desk   |   5 July 2024 4:59 AM GMT
బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్న కల్కి మూవీలో నాగ్ అశ్విని‌కు ప్రత్యేకమైన ఆ రెండు సన్నివేశాలు..
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సత్తా చాటుతూ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తున్న చిత్రం కల్కి 2898 AD. భారీ బడ్జెట్ తో .. అంతకంటే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మన పురాణాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన మహాభారత ఇతివృత్తంతో ముందుకు సాగే ఈ చిత్రం అటు భవిష్యత్తుని ఇటు వర్తమానాన్ని సమంగా బ్యాలెన్స్ చేస్తూ భారీ సక్సెస్ అందుకుంటుంది.

ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి పలు సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వింటూ ఉన్నాము. అధ్యంతం అద్భుతమైన సన్నివేశాలతో సాగే ఈ చిత్రంలో ప్రతి ఒక్కరికి తమకంటూ కొన్ని ఫేవరెట్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా దగ్గర ఉండి తెరకెక్కించిన డైరెక్టర్ నాగ అశ్విన్‌కు ప్రత్యేకంగా రెండు సన్నివేశాలు ఎంతో ఇష్టమట. అతనికి వ్యక్తిగతంగా అంతగా నచ్చిన ఆ రెండు సన్నివేశాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..

కల్కి మూవీలో తాను ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడిన తర్వాత కాంప్లెక్స్ నుంచి స్వరంగం గుండా దీపికా పదుకొణె తప్పించుకుంటుంది. ఇంటర్వెల్ మ‌కి ముందు వచ్చే ఈ సన్నివేశం గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. టెక్నికల్‌గా, పర్ఫామెన్స్ పరంగా ఎంతో చాలెంజింగ్‌గా ఉన్న ఈ సన్నివేశం నాగ అశ్విన్‌కు ఎంతో ఇష్టమైన సన్నివేశమట.

తన చుట్టూ ఎగసిపడుతున్న మంటల మధ్య బిడ్డను కాపాడుకోవడానికి ధైర్యం చేసి ఓ తల్లి ముందడుగు వేసే సన్నివేశం ఇది. సాక్షాత్ భగవంతున్ని మోస్తున్న ఆ తల్లి కోసం అగ్ని కూడా దారి ఇస్తుంది. అప్పటివరకు థియేటర్లో ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ఎన్నో సవాళ్లకు సమాధానంగా దీపిక కడుపులో ఉన్నది భగవంతుడే అని ఇన్ డైరెక్టుగా చెప్పే సన్నివేశం అది. ఇక ఇందులో దీపిక పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకే తనకు ఈ సన్నివేశం అంత ఇష్టమని నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు.

ఇక అతనికి ఇష్టమైన మరొక సన్నివేశం అశ్వత్థామ.. భైరవ మధ్య జరిగే క్లైమాక్స్ యుద్ధమట. ఇద్దరు అగ్ర తారలు కలబడే ఆ సన్నివేశం మూవీకే హైలెట్ అనడంలో డౌట్ లేదు. మరి ముఖ్యంగా అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ణుడి విజయ ధనస్సు ప్రభాస్ చేతికి వచ్చే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇందులో ప్రభాస్‌ను కర్ణుడి‌గా చూపించారు.’ఆలస్యం అయ్యిందా ఆచార్యపుత్ర’అని ప్రభాస్ డైలాగ్ చెప్పే టైం లో థియేటర్ మొత్తం దద్దరిల్లింది. కల్కి పార్ట్ 2 పై మూవీ ఎండింగ్ ఆసక్తిని బాగా పెంచింది. ఇలా సినిమా మొత్తానికి టర్నింగ్ పాయింట్స్‌గా ఉండే ఇంట్రవల్ , ఎండింగ్ సీన్స్ డైరెక్టర్ తనకు ఎంతో ఇష్టమైన సీన్స్ అని నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు.