కర్ణుడుకి కృష్ణుడి ఎలివేషన్స్ - నాగి ఏం చెప్పారంటే?
అర్జునుడు, కర్ణుడులలో ఎవరు గొప్ప అనే డిబేట్ జరగడమే చాలా మంచి విషయమని 'కల్కి 2829 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 7 July 2024 9:59 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ 'కల్కి 2829 ఏడీ'. బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. రెండో వారంలోనూ హవా కొనసాగిస్తోంది. హిందూ పురాణాలు, ఇతిహాసాలను భవిష్యత్ ప్రపంచానికి ముడిపెడుతూ ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీని రూపొందించారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ ను అబ్బురపరుస్తున్నారు. ఇక ఈ సినిమాతో మహాభారతంలోని ఐకానిక్ పాత్రలైన శ్రీ కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వద్ధామ పాత్రలను మరోసారి బిగ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసారు దర్శకుడు నాగి. క్లైమాక్స్ లో కర్ణుడికి కృష్ణుడు ఎలివేషన్స్ ఇచ్చినట్లుగా చూపించారు. దీంతో గత కొన్ని రోజులుగా అర్జునుడు, కర్ణుడులలో ఎవరు గొప్ప అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయం మీద ఇటీవల నాగ్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
అర్జునుడు, కర్ణుడులలో ఎవరు గొప్ప అనే డిబేట్ జరగడమే చాలా మంచి విషయమని 'కల్కి 2829 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఒకదాని గురించి వాధించుకుంటూ, ఒకదాని తర్వాత ఒకటి బయటకు తవ్వుతారు. చివరకు మహా భారతంలోని ధర్మం అధర్మం గురించి వాధించుకుంటారు. ఒకరకంగా అది మంచిదే అనిపిస్తుంది అని అన్నారు. మహాభారతంలో ప్రతీ పాత్ర నేపథ్యం ఎంతో గొప్పగా ఉంటుందని, తనకు మాత్రం కర్ణుడు ఫేవరేట్ క్యారక్టర్ అని నాగి తెలిపారు. క్లయిమాక్స్ లో కృష్ణుడు ఎలివేషన్ ఇస్తున్నప్పుడు, కర్ణుడి పాత్రను రథం మీద రిలీజ్ చేసే సన్నివేశం సరిగ్గా కుదిరిందని.. అది తన ఫేవరేట్ సీన్ అని చెప్పారు.
''నేను 'కల్కి 2829 AD' సినిమాని మొదలుపెట్టక ముందు మహాభారతానికి సంబంధించిన 10 పుస్తకాలు ట్రాన్సలేట్ చేసుకొని చదివాను. వాస్తవానికి మహాభారతంలో కర్ణుడు, అశ్వత్థామలకు కృష్ణుడు ఎలివేషన్ ఇస్తాడు. ఆయన ఇచ్చే ఎలివేషన్స్ డిఫరెంట్ లెవెల్ లో ఉంటాయి. మనం రాసే వాటిల్లో చాలా తూచ్ డైలాగ్స్ ఉంటాయి. కృష్ణుడు ఎలివేషన్స్ చాలా హైలైట్ గా ఇస్తారు'' అని నాగ్ అశ్విన్ తెలిపారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడిగా రివీల్ చెయ్యడంతో, పార్ట్-2లో ఆయన పాత్రని నెగిటివ్ గా చూపిస్తారా? లేదా పాజిటివ్ చూపిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై దర్శకుడు స్పందిస్తూ కర్ణుడి పాత్ర పాజిటివ్ గానే వుంటుందని స్పష్టం చేసారు.
''ఇండియాలో ఎక్కడ చూసినా అందరూ కర్ణుడి క్యారెక్టర్ ని లవ్ చేస్తారు. ఎవరికైనా ఆయన కథకి పాత్రకి జస్టిస్ చేయాలనే వుంటుంది. 'కల్కి' రెండో భాగంలో కర్ణుడికి సంబధించిన అన్ని విషయాలు చూపిస్తాం. అవన్నీ చాలా కొత్తగా కనిపిస్తాయి'' అని అన్నారు నాగ్ అశ్విన్. అశ్వద్ధామ చేసిన పాపాలకు విముక్తి చేసుకోవడానికే కృష్ణుడు శాపం ఇస్తాడు. ఈ సినిమాలో కర్ణుడి పాత్ర కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు అని నాగి చెప్పుకొచ్చారు.
'కల్కి 2829 ఏడీ' చిత్రంలో భైరవ అనే బౌంటీ హంటర్ పాత్రలో ప్రభాస్ నటించారు. చివర్లో కర్ణుడిగా కనిపించి సర్ప్రైజ్ చేసారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ, ఉత్తరగా మాళవిక నాయర్, కృష్ణుడిగా తమిళ నటుడు కెకె నటించారు. కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పటాని, అన్నా బెన్, పశుపతి, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.