Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : కల్కి స్టార్స్‌.... వీళ్లు వాళ్లేనా!

ఇతర దేశాల్లో కూడా అదే స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ కనిపించారు

By:  Tupaki Desk   |   1 July 2024 6:03 AM GMT
పిక్‌టాక్‌ : కల్కి స్టార్స్‌.... వీళ్లు వాళ్లేనా!
X

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన కల్కి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా.. ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ సినీ ప్రేమికులు కల్కి సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. యూఎస్ లోనే ఈ సినిమా వంద కోట్ల మార్క్ కి చేరువ అయ్యింది.

ఇతర దేశాల్లో కూడా అదే స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ కనిపించారు. ముఖ్యంగా అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, విజయ్ దేవరకొండలు పోషించిన పాత్రలు సినిమా స్థాయిని పెంచడంతో పాటు, సినిమా ను వార్తల్లో నిలిపాయి అనడంలో సందేహం లేదు.

విజయ్ దేవరకొండ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కల్కి సినిమాలో భాగం అయినందుకు సంతోషపడుతున్నాను. ఈ సినిమాను నేను నాగి తో ఉన్న స్నేహం తో, ప్రభాస్ పై ఉన్న అభిమానంతో చేశాను అన్నాడు. నిజమే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమా ఎవడే సుబ్రమణ్యం లో నటించడం వల్లే దేవరకొండ కి గుర్తింపు లభించింది.

అందుకే నాగ్‌ అశ్విన్‌ ప్రతి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఏదో ఒక పాత్ర లో కనిపిస్తున్నాడు. మహానటి లో చిన్నదైన జర్నలిస్ట్‌ పాత్రలో నటించాడు. ఇప్పుడు కల్కి లో కూడా నటించాడు. ఈ సమయంలో నాగ్‌ అశ్విన్ మరియు విజయ్‌ దేవరకొండల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.

సోషల్‌ మీడియాలో వీరిద్దరు కలిసి ఉన్న ఈ పాత ఫోటో వైరల్‌ అవుతోంది. ఎవడే సుబ్రమణ్యం సినిమా సమయంలో తీసుకున్న ఈ ఫోటోకి నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఆ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది.

ఈ పదేళ్లలో విజయ్‌ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు, నాగ్‌ అశ్విన్‌ పాన్‌ వరల్డ్‌ మూవీ ని తీసి స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. వారి స్థాయిల్లో ఎంత మార్పు వచ్చిందో, వారి లుక్ పరంగా కూడా అదే స్థాయి మార్పు వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు వాళ్లేనా అన్నట్లుగా కొందరు సరదాగా కామెంట్స్ చేస్తూ ఫోటోలను తెగ షేర్‌ చేస్తున్నారు.