Begin typing your search above and press return to search.

600 కోట్ల మూవీ డైరెక్టర్… చిన్న కారులో అలా..

ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు వందల కోట్ల రూపాయిలతో సినిమాలు చేసిన చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 9:20 AM GMT
600 కోట్ల మూవీ డైరెక్టర్… చిన్న కారులో అలా..
X

ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు వందల కోట్ల రూపాయిలతో సినిమాలు చేసిన చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కోరికలు లేకుండా కామన్ మెన్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతూ ఉంటారు. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికి ఆయన చిన్న ఇంట్లో ఉంటాడంట. దర్శకుల ఆలోచనలు, ఇమాజినేషన్ అద్భుతాలు చేసిన ఆ కలల ప్రపంచంలోకి వారు మాత్రం వెళ్ళరు.

ఈ కోవలోకి టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వస్తారని చెప్పొచ్చు. సుమారు 600 కోట్ల బడ్జెట్ తో కల్కి 2898 ఏడీ సినిమాని నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ నడుస్తోంది. హాలీవుడ్ లెవల్ లో ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని కల్కి 2898 ఏడీ పరిచయం చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నాడు.

ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని కల్కి చిత్రాన్ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. కల్కి మూవీ కోసం 4+ కోట్లకి పైగా ఖర్చు పెట్టి ఓ త్రీవీల్ కారుని కూడా నాగ్ అశ్విన్ డిజైన్ చేయించాడు. వేల కోట్ల ఆస్తి ఉన్న అశ్వినీదత్ అల్లుడుగా కూడా నాగ్ అశ్విన్ కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. చుట్టూ సంపద ఉన్న కూడా నాగ్ అశ్విన్ లైఫ్ స్టైల్ మాత్రం చాలా సాధారణంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

తాజాగా నాగ్ అశ్విన్ ఓ చిన్న కారుని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి సంబందించిన వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు ధర కూడా చాలా తక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు వాడే కారు తరహాలో ఇది ఉంది. అన్ని వందల కోట్ల సినిమా చేసిన దర్శకుడు ఇంత చిన్న కారులో వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

నాగ్ అశ్విన్ చూడటానికి చాలా సింపుల్ గా, డైరెక్టర్ అనే ఆటిట్యూడ్ కూడా చూపించకుండా మనలో ఒకడిగా కనిపిస్తాడని అతనితో పరిచయం ఉన్నవారు అంటున్న మాట. అతను సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడనే మాట వినిపిస్తోంది. ఇక అతని మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కూడా జీవితం గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. డబ్బు, హోదా కంటే మానవత్వం విలువలు ప్రేమలు చాలా గొప్పవి అని చెప్పాడు. ఇక అతని రియాలిటీలో కూడా అలానే ఉంటాడు అని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.