Begin typing your search above and press return to search.

రాజమౌళి డ్రీమ్.. నాగ్ అశ్విన్ టచ్!

జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 11:32 AM GMT
రాజమౌళి డ్రీమ్.. నాగ్ అశ్విన్ టచ్!
X

ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న దర్శకుడు ఎవరంటే వెంటనే రాజమౌళి అని చెబుతారు. కెరియర్ లో ఒక్క ఫెయిల్యూర్ లేకుండా వరుస విజయాలతో రాజమౌళి దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా రాజమౌళి తనదైన గుర్తింపుని క్రియేట్ చేసుకున్నారు. జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమా పై హాలీవుడ్ మీడియా సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అడ్వాంచర్ థ్రిల్లర్ జోనర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని జక్కన్న చేయబోతున్నారు. అయితే మహాభారతం తన డ్రీం ప్రాజెక్ట్ అని గతంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన ఫైనల్ ప్రాజెక్ట్ మహాభారతమే అవుతుందని కూడా చెప్పారు. ఆ చిత్రాన్ని సిరీస్ గా చేస్తానని రాజమౌళి ఇంటర్వ్యూ తెలియజేశారు.

మహాభారతం రాజమౌళి చేస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని, ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అవుతుందని అందరూ భావించారు. అయితే జక్కన్న మహాభారతం మొదలు పెట్టడానికంటే ముందు నాగ్ అశ్విన్ దానిని కల్కి 2898ఏడీ సినిమాలో టచ్ చేశాడు. కల్కి తర్వాత మల్టీవర్స్ కథలతో ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని మూవీస్ చేయనున్నట్లు నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు.

ఈ మల్టీవర్స్ కథలలో మహాభారతం కూడా ఉండబోతోందని కల్కి 2898ఏడీ ద్వారా నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలో కురుక్షేత్రం సంగ్రామంలో అంతిమ ఘట్టాన్ని బిగ్ స్క్రీన్ పై నాగ్ అశ్విన్ చూపించారు. ఈ ఎపిసోడ్ లో అర్జునుడి, కర్ణుడి పాత్రలు హైలెట్ అయ్యాయి. కర్ణుడి గురించి అశ్వద్ధామ చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. అలాగే కృష్ణుడి పేస్ రివీల్ చేయకపోయిన అతని క్యారెక్టర్ ని కూడా కల్కిలో నాగ్ అశ్విన్ ఎస్టాబ్లిష్ చేశారు.

దీని ద్వారా మహాభారతం బేస్ చేసుకొని మల్టీవర్స్ కథలు నెక్స్ట్ చేయబోతున్నట్లు నాగ్ అశ్విన్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. అయితే పూర్తిస్థాయిలో మహాభారతం 18 పర్వాల కథని దృశ్యరూపంలో తీసుకొస్తే చాలా సినిమాలు అవుతాయి. వాటిపై రాజమౌళి ఏ విధంగా ఫోకస్ చేస్తాడు అనేది చూడాలి. మహాభారతం బేస్ చేసుకొని ఫ్యూచర్ లో చాలా సినిమాలు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు మొదలు పెడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తప్పితే మహాభారతం ను ఎవరు అంత ఈజీగా టచ్ చేయలేరు అని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ కాస్త టచ్ చేసినందుకే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక అతను పూర్తి స్థాయిలో మహాభారతం కురుక్షేత్రం లాంటి కాన్సెప్ట్ లను టచ్ చేస్తే ఆ వైబ్ మామూలుగా ఉండదు.