బాంబే IIT ఫెస్ట్ లో 'కల్కి' డైరెక్టర్.. సౌండ్ మాములుగా లేదు
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jan 2024 11:04 AM GMTపాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న ఈ హీరో రీసెంట్ గా 'సలార్' తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక సలార్ తర్వాత ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా కనిపించనుండగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్టుపోన్ అయ్యింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవల బాంబే ఐఐటిలో జరిగిన కాలేజీ ఫెస్ట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ టెక్నికల్ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అవుతూ కల్కి గ్రాఫిక్ వర్క్స్ మరియు చిత్ర విషయాలు గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోని స్నేక్ పీక్ రూపంలో మూవీ టీం ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో బాంబే ఐఐటి ఫెస్ట్ లో నాగ్ అశ్విన్ పాల్గొనడం, ఎంతో మంది స్టూడెంట్స్ ఈ ఫెస్ట్ కి రావడం, ఇక ఫెస్ట్ లో స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ నాగ్ అశ్విన్ సమాధానాలు ఇవ్వడం ఈ వీడియోలో గమనించవచ్చు.
అంతేకాదు ఈ వీడియోలో నాగ్ అశ్విన్ కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ ని చూడబోతున్నారని, చెప్పడం లైవ్ లోనే ప్రభాస్ కి ఫోన్ మాట్లాడడం హైలెట్ గా నిలిచాయి. అలాగే థియేటర్లో కల్కి గ్లింప్స్ ని ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్న క్లిప్ ని కూడా ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.
షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమాను ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.