Begin typing your search above and press return to search.

అప్పుడు సందీప్ అలా.. ఇప్పుడు నాగి ఇలా..

నాగ్ అశ్విన్.. కొద్దిరోజులుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు బాగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   15 July 2024 6:51 AM GMT
అప్పుడు సందీప్ అలా.. ఇప్పుడు నాగి ఇలా..
X

నాగ్ అశ్విన్.. కొద్దిరోజులుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు బాగా వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ టాలెంట్ పట్ల ఇప్పటికీ ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. అయితే వరల్డ్ వైడ్ గా కల్కి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోంది. దీంతో ప్రభాస్.. రీసెంట్ గా థ్యాంక్స్ చెబుతూ వీడియో మెసేజ్ ఇచ్చారు.

తాజాగా నాగ్ అశ్విన్ కూడా అంతటి బిగ్ సక్సెస్ అందించిన సినీ ప్రియులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు. "ఈ మైలురాయి మా లాంటి యంగ్ టీమ్ కు సో బిగ్గెస్ట్. దీనిని ఎలాంటి రక్తపాతం, హింస, అశ్లీలత, రెచ్చగొట్టే కంటెంట్ లేకుండా సాధించడం గొప్ప విషయం. అందుకే అండగా నిలిచిన ప్రేక్షకులు, సినీ నటీనటులకు థ్యాంక్స్. ఇండియన్ సినిమా రేపటి కోసం.." అంటూ నాగ్ అశ్విన్ పోస్ట్ చేయగా.. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో నాగ్ అశ్విన్.. గత ఏడాది వచ్చిన యానిమల్ మూవీపై పంచ్ వేశారని కొందరు నెటిజన్లు అన్నారు. అలాంటిదేం లేదని మరి కొందరు వాదించారు. అలా పెద్ద ఎత్తున చర్చ ఊపందుకుంది. వెంటనే నాగి తన పోస్ట్ ను డిలీట్ చేశారు. కానీ అప్పటికే అనేక మంది సందీప్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టేశారు. బిగ్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్, స్పెషల్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్.. అలా అన్ని అంశాలు ఉండడం వల్ల కల్కి రూ.1000 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు.

కానీ యానిమల్.. కల్కిలో 25 శాతం బడ్జెట్ తో భారీ విజయం సాధించిందని చెబుతున్నారు. ఎమోషన్స్, స్ట్రాంగ్ మ్యూజిక్, ఫుల్ యాక్షన్ తో హిట్ అయిందని అంటున్నారు. అదే సమయంలో నాగ్ అశ్విన్ మహానటి మూవీ గురించి సందీప్ వంగా.. అప్పట్లో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ సినిమాకు తాను డైరెక్టర్ ను అయ్యి ఉంటే.. మరిన్ని భావోద్వేగాలతో పాటు పలు అంశాలను యాడ్ చేసేవాడినని తెలిపారు సందీప్ వంగా.

నాగ్ అశ్విన్ మేకింగ్ ను నేరుగా విమర్శించనప్పటికీ, తన వెర్షన్ లో సినిమా ఎలా ఉంటుందనేది చెప్పారు. దీంతో అందుకే నాగి.. ఇప్పుడు సందీప్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. దీంతో మళ్లీ నాగ్ అశ్విన్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.