Begin typing your search above and press return to search.

కల్కి నాగ్ అశ్విన్.. ఆ ఇద్దరే అతని అసలు బలం

ఇక ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ తనకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న దత్ ల గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   1 July 2024 1:24 PM GMT
కల్కి నాగ్ అశ్విన్.. ఆ ఇద్దరే అతని అసలు బలం
X

నాగ్ అశ్విన్ తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరొందారు. శేఖర్ కమ్ముల దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన అతను ఆ తరువాత డైరెక్టర్ గా మారాలని చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. ఫైనల్ గా నాగ్ అశ్విన్ తన తొలి సినిమా "ఎవడే సుబ్రహ్మణ్యం" ద్వారా 2015 లో ఇండస్ట్రీలోకి వచ్చాడు.

వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ కూతుర్లు స్వప్న, ప్రియాంక దత్ ఇద్దరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినినా నాని ప్రధాన పాత్రలో, అందమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో అశ్విన్ దర్శకత్వంలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రచనలో తన ప్రతిభను చూపించి, ఫిల్మ్ మేకింగ్ లో ఒక కొత్త దారిని సృష్టించాడు. ఆ సినిమా విజయ్ దేవరకొండకు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

అశ్విన్ తన రెండవ చిత్రం "మహానటి"తో మరింత గుర్తింపు పొందాడు. ఈ సినిమా, దక్షిణ భారత ప్రముఖ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబడింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక "మహానటి" అశ్విన్ కు జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. అశ్విన్ చెప్పిన కథనంలో సావిత్రి జీవితంలోని విలువలను, భావోద్వేగాలను ప్రతిభావంతంగా ప్రదర్శించాడు.

ఇక అతని తాజా చిత్రం "కల్కి 2898AD" అశ్విన్ ప్రతిభకు మరో సాక్ష్యం. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులతో చేసిన ఈ చిత్రం, తన కొత్త తరహా కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ సినిమా కొత్త యుగం కథలతో తెలుగు సినిమాకు కొత్త పరిమాణాన్ని అందించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా కొనసాగుతోంది.

ఇక ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ తనకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న దత్ ల గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. స్వప్న దత్ ను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా టైమ్ లోనే ఇష్టపడిన నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్నారు. ఇక కల్కి సినిమా విజయంతో వారి మరింత ఆనందంలో ఉన్నారు. ఇక వారి గురించి నాగ్ అశ్విన్ ఈ విధంగా వివరించారు.

సుమారు 10 సంవత్సరాల క్రితం, మేము ముగ్గురం కలిసి మా తొలి చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం"ని ప్రారంభించాము. అప్పుడు వైజయంతి చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఈ చిత్రం రిస్క్‌తో కూడుకున్నది. నాకు ఒక రోజు షూటింగ్ గుర్తుంది. 20 ఎక్స్‌ట్రాలతో ఇబ్బంది పడ్డాం. అనుకున్న టైమ్ కు మేము పూర్తి చేయలేకపోయాము. మేము తిరిగి వచ్చి మళ్లీ సెటప్ చేయాల్సి వచ్చింది. ఆ అదనపు ఖర్చు లెక్కించబడదు.

అది కాస్త మమ్మల్ని విచ్ఛిన్నం చేసి భయాందోళనకు గురిచేసింది. ఇప్పుడు ఇక తిరిగి చూసుకుంటే ఆ ఖర్చు పెద్దది కాదు అస్సలు. అటు నుండి ఇటు. 10 ఏళ్ల తర్వాత. మేం కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు, సినిమా చరిత్రలో తనదైన రీతిలో ఒక చిన్న మైలురాయిగా నిలిచాయి. ఇప్పుడు వీరి మధ్య నిలబడటం గర్వంగా ఆశీర్వాదంగా భావిస్తున్నాను.. అని నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చారు.