Begin typing your search above and press return to search.

'కల్కి'.. అసలు విషయాలు చెప్పబోతున్న నాగ్ అశ్విన్

హ్యాట్రిక్ ప్లాప్స్ తర్వాత సలార్ రూపంలో ప్రభాస్ కి భారీ సక్సెస్ దక్కడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 12:50 PM GMT
కల్కి.. అసలు విషయాలు చెప్పబోతున్న నాగ్ అశ్విన్
X

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం 'సలార్' సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాట్రిక్ ప్లాప్స్ తర్వాత సలార్ రూపంలో ప్రభాస్ కి భారీ సక్సెస్ దక్కడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ ని డబుల్ చేసేందుకు ప్రభాస్ కి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. సలార్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రం 'కల్కి 2898 ఏడి'.


సైన్స్ ఫిక్షన్ జానెర్ లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ కల్కి సినిమా గురించి తెలియని విశేషాలను అడిగి తెలుసుకునేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

IIT బాంబే Tech Fest 23 లో నాగ్ అశ్విన్ పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 29న మధ్యాహ్నం గం.1:30 నిమిషాలలకు కన్వెన్షన్ హాల్ లో ఈ మీట్ జరగనుంది. ఇదే విషయాన్ని తాజాగా మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. కల్కి సినిమాకి సంబంధించిన అనేక విషయాలను నాగ్ అశ్విన్ ఈ మీట్ లో ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు. ఇక ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.

దిశా పటాని, దుల్కర్ సల్మాన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యంతో పాటు మరికొన్ని ఇతర కారణాలవల్ల సమ్మర్ కి వాయిదా వేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.