ఆ ఒక్కటీ నాగ్ అశ్విన్ నేర్చుకోవాల్సిందే!
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకున్నారు
By: Tupaki Desk | 5 July 2024 9:30 AM GMTసౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆ రెండు సినిమాలు వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేశాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చింది. మొట్టమొదటి సారి ఇండియన్ సినిమాకిగా ఆస్కార్ రావడం ఆర్ఆర్ఆర్ తోనే సాధ్యం ఏవయ్యింది.
హాలీవుడ్ మేకర్స్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ మూవీతో వరల్డ్ వైడ్ గా అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి కల్కి సినిమాని విజువల్ వండర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు.
దీంతో ప్రేక్షకుల నుంచి సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో అక్కడక్క కొన్ని లోటుపాట్లు ఉన్న ఓవరాల్ గా మూవీ ప్రేక్షకులని నచ్చింది. అలాగే మూవీలో క్యారెక్టరైజేషన్స్ విషయంలో హిందుత్వ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే అవి మరీ ఇతిహాసాలని అవమానించే విధంగా లేవని చెప్పొచ్చు. ఈ కారణంగానే యాక్సప్టబుల్ మిస్టేక్స్ గా వాటిని పరిగణించారు.
ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ భైరవ పాత్రలో నటించాడు. అశ్వద్ధామ పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అద్భుతమైన నటనతో మెప్పించారు. ఓ విధంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో హీరో అని అందరూ ఒప్పుకుంటున్నారు. గత దశాబ్ద కాలంలో అమితాబ్ బచ్చన్ ని ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఆడియన్స్ చూడలేదు. అందుకే హిందీ బెల్ట్ లో కల్కి సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకునేకి మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించింది.
బాలీవుడ్ స్టార్స్ ని నాగ్ అశ్విన్ కల్కిలో పెర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నాడు. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ అజయ్ దేవగన్ లాంటి మాస్ హీరోని, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్ ని తీసుకున్నారు. మూవీలో వారిద్దరి పాత్రలు కూడా చెప్పుకోదగ్గ గొప్పగా లేవు. అజయ్ దేవగన్ క్యారెక్టర్ ని చాలా వేగంగా ముగించేశారు. అలియా భట్ హీరోయిన్ గా ఉందని పేరుకే తప్ప పెర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేని పాత్రలో చేసింది. బాలీవుడ్ స్టార్స్ ని ఎంపిక చేసే సమయంలో వారి ఇమేజ్ కి తగ్గ బలమైన పాత్రలని ఇస్తే హిందీ బెల్ట్ లో ఎక్కువ ఆదరణ వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం జక్కన్న నాగ్ అశ్విన్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.