Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా గర్వించేలా… నాగ్ అశ్విన్ ఇన్ స్టా స్టోరీ

మార్వెల్ సిరీస్ తరహాలో ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి నాగ్ అశ్విన్ కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు

By:  Tupaki Desk   |   13 Jun 2024 6:57 AM GMT
తెలుగు సినిమా గర్వించేలా… నాగ్ అశ్విన్ ఇన్ స్టా స్టోరీ
X

మార్వెల్ సిరీస్ తరహాలో ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి నాగ్ అశ్విన్ కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సూపర్ హీరో కథలు అంటే ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలనే అందరూ చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో ఇండియన్ సూపర్ హీరో కథలకి హాలీవుడ్ లెవల్ లో ఎంట్రీ పాస్ గా కల్కి 2898 ఏడీ మూవీ ఉండబోతుందనే మాట ఇప్పటికే వినిపిస్తోంది.

తాజాగా కల్కి 2898 ఏడీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో డార్లింగ్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జూన్ 27న కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వస్తోంది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలలో నటించారు. దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్స్ అదిరిపోయే రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా కల్కి 2898 ఏడీ రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ గట్టిగా చేస్తోంది. వీలైనంత స్ట్రాంగ్ లో పబ్లిక్ లోకి ఈ సినిమాని పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్ స్టా స్టోరీలో కల్కి 2898 ఏడీ మూవీ గురించి ఇంటరెస్టింగ్ స్టోరీ షేర్ చేశారు. మనం ఇప్పటివరకు మార్వెల్, డీసీ చిత్రాలు ప్రమోట్ చేసాం. ఇక ఇప్పుడు మన కల్కి 2898ఏడీని ప్రమోట్ చేద్దాం. బాహుబలి తో ప్రభాస్ గారు ఇండియన్ సినిమాని తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలిపారు. ఇప్పుడు ప్రభాస్, నాగ్ అశ్విన్ లు తెలుగు సినిమా అంటే ఏంటో చూపేందుకు కల్కి తో సిద్ధం అవుతున్నారు.

ఇది మన ప్రభాస్ సినిమా మన తెలుగు సినిమా ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాం అంటూ ఇన్ స్టాలో నాగ్ అశ్విన్ స్టోరీ షేర్ చేశారు. ఈ స్టోరీ కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ బట్టి కల్కి సినిమాపై నాగ్ అశ్విన్ అండ్ కో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి జూన్ 27న రిలీజ్ కాబోయే కల్కి వరల్డ్ వైడ్ గా ఎలాంటి అద్భుతాలు చేస్తుందనేది వేచి చూడాలి.