'కల్కి 2898 AD' బ్రేక్ డౌన్!
మోస్ట్ అవైటెడ్ `కల్కి` ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ తో నాగ్ అశ్విన్ ఎలాంటి ప్రయోగం చేస్తున్నాడో అందరికీ అర్థమైంది.
By: Tupaki Desk | 12 Jun 2024 4:36 AM GMTమోస్ట్ అవైటెడ్ `కల్కి` ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ తో నాగ్ అశ్విన్ ఎలాంటి ప్రయోగం చేస్తున్నాడో అందరికీ అర్థమైంది. ఆసక్తికరంగా ఈ ట్రైలర్ లో , అలాగే కల్కి యానిమేటెడ్ సిరీస్ గ్లింప్స్ లో ఇప్పటికే కథ ఏమిటన్నది చూఛాయగా చెప్పేసాడు నాగ్ అశ్విన్. చాలామంది కల్కి 2898 ఎడి కథకు డ్యూన్, మ్యాడ్ మ్యాక్స్ లాంటి సినిమాలే స్ఫూర్తి అంటూ కథనాలు అల్లుతున్నారు.
అయితే నాగ్ అశ్విన్ చాలా తెలివిగా మహాభారతం కనెక్షన్ ని ఉపయోగిస్తూ భారత సంగ్రామంలోని సీన్స్ ని డ్రాగ్ చేస్తూ.. అశ్వత్థామ కథను, విష్ణు మూర్తి అయిన కల్కి అవతారాన్ని ఎలివేట్ చేస్తూ ఒక మ్యాజికల్ విజువల్ వండర్ ని క్రియేట్ చేసాడని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. అసలు మరణం అన్నదే లేని అశ్వత్థామ భూమ్మీదికి ఎందుకు వచ్చాడు? అతడు భైరవ (ప్రభాస్)తో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? అన్నదే కీలకమైన ఎలిమెంట్. ఆ ఇద్దరి వైరానికి కారణమేమిటో తెలుసుకోగలిగితే ఇక సినిమా కథ మొత్తం తెలిసిపోయినట్టే.
అంతేకాదు చాలా హాలీవుడ్ సినిమాల్లో సైన్స్ ల్యాబ్స్ అందులో ప్రయోగాలతో మానవాళికి వచ్చే ముప్పు గురించి చూసాం. ఇప్పుడు కల్కిలోను అలాంటి ఒక భారీ ప్రయోగం ఉంది. ఈ ప్రయోగానికి సైంటిస్టులు స్త్రీలను ఉపయోగించుకుంటారు. ట్రైలర్ లో దీపికను ఒక గర్భిణిగా చూపించారు. పైగా బాగా అలసిపోయి కష్టంలో ఉన్న యువతిని తలపిస్తోంది దీపిక. డ్యూన్ లాంటి సినిమాల్లో జెండయా పాత్ర వేషధారణను దీపిక కోసం డ్రాగ్ చేసారని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే తమ సైన్స్ ప్రయోగాలకు దీపిక ను ఉపయోగించుకుంటారని, అలాగే ట్రైలర్ లో చూపించిన పిరమిడ్ కు ఏదో కనెక్షన్ ఉందని కూడా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఆసక్తికరంగా కల్కి టైటిల్‌తో కానీ, ఆ పేరుతో కానీ ప్రభాస్ కి ఏ సంబంధం లేదు. కల్కి ఎక్కడో అంతరిక్షంలో వేరే గ్రహంలో దీపికకు జన్మించబోతున్నాడని అతడే ఈ భూప్రపంచాన్ని కాపాడేవాడు అవుతాడని కూడా ఈ కథలో ట్విస్టులు చూపించబోతున్నారు. ప్రభాస్ పాత్రను నెగెటివ్ షేడ్స్ లో నాగ్ అశ్విన్ ఎలివేట్ చేస్తాడని, అశ్వత్థామ పాత్రధారి అయిన అమితాబ్ బచ్చన్ తో అతడి ఫేసాఫ్ రక్తి కట్టిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.
అశ్వత్థామ నుదిటిన ఉండే క్రిస్టల్ పాత్ర ఏమిటన్నది కూడా తెరపైనే చూడాలి. ఆసక్తికరంగా ఈ భూప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చే ప్రమాదకారిగా కమల్ హాసన్ పాత్రను తెరపై చూపించనున్నారు. ఓవరాల్ గా నాగ్ అశ్విన్ ఎంపిక చేసుకున్న స్టోరి భారీతనంతో అద్భుత విజువల్ వండర్ ని క్రియేట్ చేసేందుకు అనుకూలమైనదని అర్థమవుతోంది. కల్కి 2989 ఏడి సినిమాని చూసేయాలనే ఉత్కంఠను ట్రైలర్ తో తెచ్చారు. వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిందని కథనాలొస్తున్నాయి.