Begin typing your search above and press return to search.

కల్కి 2: వామ్మో.. ఇలా కూడా ఆలోచిస్తారా..

హిందీ బెల్ట్ లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసి డబ్బింగ్ సినిమాల పరంగా టాప్ 3లో ఉంది.

By:  Tupaki Desk   |   23 July 2024 7:57 AM GMT
కల్కి 2: వామ్మో.. ఇలా కూడా ఆలోచిస్తారా..
X

కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసిన కల్కి మూవీ లాంగ్ రన్ లో ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నార్త్ అమెరికాలో ఇప్పటికే నాన్ బాహుబలి 2 రికార్డులని కల్కి అధికమించింది. హిందీ బెల్ట్ లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసి డబ్బింగ్ సినిమాల పరంగా టాప్ 3లో ఉంది.


కల్కి 2898ఏడీ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్ గా రాబోయే పార్ట్ 2 మీద అంచనాలు క్రియేట్ అయ్యాయి. కల్కి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అయిన కూడా బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కల్కి పార్ట్ 2 మూవీ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. కొన్ని సన్నివేశాలు మరల రీషూట్ చేయబోతున్నట్లు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం దీపికా పదుకునే గర్భవతిగా ఉంది. ప్రభాస్ వరుస సినిమాలు షూటింగ్స్ ఉన్నాయి. వీరి కాల్ షీట్స్ చూసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నారు. అన్ని కరెక్ట్ గా జరిగితే ఈ ఏడాది ఆఖరులో కల్కి పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా నాగ్ అశ్విన్ ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో ఇంటరెస్టింగ్ ఫొటో షేర్ చేశారు.

ఈ ఫొటోలో కల్కి పార్ట్ 2 సినిమాపై తాము ఇలాగే నిర్ణయం తీసుకున్నామని పేర్కొనన్నారు. అందులో నెంబర్ 2 రాసిన పేపర్ స్లిప్ ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పేపర్ స్లిప్స్ వేసుకొని కల్కి పార్ట్ 2 మూవీ చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇంటరెస్టింగ్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది సరదాగా నాగ్ అశ్విన్ షేర్ చేసి ఉంటాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కల్కి పార్ట్ 2 చేయాలనే నిర్ణయం ఎలా తీసుకున్న కూడా ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా నాగ్ అశ్విన్ చేశారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకి చేరువ చేయడానికి నాగ్ అశ్విన్ అండ్ కో ప్రయత్నం చేస్తున్నారు. చైనా, జపాన్ తో పాటు హాలీవుడ్ మార్కెట్ పైన దృష్టిపెట్టారు.