Begin typing your search above and press return to search.

నాగ్ అశ్విన్ కామెంట్ తో… మరో కాంట్రవర్సీ!

హిందీలో కూడా ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలిపి క్రాస్ చేసింది.

By:  Tupaki Desk   |   14 July 2024 11:30 PM GMT
నాగ్ అశ్విన్ కామెంట్ తో… మరో కాంట్రవర్సీ!
X

కల్కి2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఇండియన్ 2, సర్ఫిరా సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ ని కల్కి సినిమా అందుకుంటుంది. కల్కి మూవీ మూడవ వారంలోకి ఎంటర్ అయిన ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తూనే ఉంది. హిందీలో కూడా ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలిపి క్రాస్ చేసింది.


అలాగే ఓవర్సీస్ లో కూడా కల్కి మూవీ 17 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కి దాటిపోయి సౌత్ సినిమాల్లో నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. తెలుగులో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా కల్కి మూవీ నిలిచింది. ఇదిలా ఉంటే మూడో సినిమాతోనే వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ని నాగ్ అశ్విన్ అందుకోవడంతో దేశ వ్యాప్తంగా అతనికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 1000 కోట్ల కలెక్షన్స్ ని ఉద్దేశించి నాగ్ అశ్విన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు.

ఇప్పుడు ఇది కొత్త కాంట్రవర్సీకి కారణం అయ్యింది. మావంటి యంగ్ టీమ్ కి 1000 కోట్ల మైల్ స్టోన్ అనేది చాలా పెద్దది. నిజం ఏంటంటే ఈ రికార్డ్ కలెక్షన్స్ ని ఎలాంటి బ్లడ్, గాయాలు, అశ్లీలత, రెచ్చగొట్టే సంభాషలు, ఇతరుల మనోభావాల్ని కించపరిచే కంటెంట్ లేకుండా సాధించాం. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నన్ను నమ్మి నా వెనుక నిలబడ్డ నటీనటులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని స్టోరీలో రాసుకొచ్చారు.

ఈ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ ఈ పోస్ట్ చేసింది సందీప్ రెడ్డి వంగా యానిమల్ ని ఉద్దేశించే అనే ప్రచారం తెరపైకి వచ్చింది. యానిమల్ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ వైలెంట్ మూవీగా యానిమల్ చిత్రాన్ని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కొంతమంది క్రిటిక్స్ అయితే యానిమల్ మూవీపై విమర్శలు చేశారు.

వైలెన్స్, రక్తపాతం లేకుండా కూడా సినిమా సూపర్ హిట్ అందుకోవచ్చని నాగ్ అశ్విన్ కల్కి మూవీతో ప్రూవ్ చేసాడనే యానిమల్ ని విమర్శించేవారు అంటున్నారు. సందీప్ రెడ్డికి నాగ్ అశ్విన్ కరెక్ట్ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ పోస్ట్ డైరెక్ట్ గా సందీప్ రెడ్డికి తగులుతాయని అంటున్నారు. అయితే యానిమల్ సినిమాని ఇష్టపడేవారు నాగ్ అశ్విన్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి కౌంటర్ ఇస్తున్నారు.

కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే లాంటి స్టార్స్ ఉన్నారని, అలాగే యానిమల్ కంటే నాలుగు రెట్లు బడ్జెట్ తో కల్కి సినిమాని తీశారని కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్ మూవీ కేవలం కంటెంట్, మ్యూజిక్, రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని, కల్కి సినిమా మాత్రం కేవలం గ్రాండ్ నెస్ ని నమ్ముకొని తెరకెక్కించారని విమర్శిస్తున్నారు. రెండింటికి చాలా తేడా ఉందని కామెంట్స్ చేస్తున్నారు

నిజానికి నాగ్ అశ్విన్ కి కల్కి మూడో సినిమానే, అలాగే యానిమల్ సందీప్ రెడ్డి వంగా మూడో సినిమాగానే వచ్చింది. ఇద్దరు వారి వారి విజనరీతో సక్సెస్ ఫుల్ గా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. వైలెన్స్ అయిన, ఫాంటసీ అయిన అంతిమంగా ప్రేక్షకులు మంచి రిజల్ట్ ఇస్తే కచ్చితంగా అది గొప్ప సినిమానే అవుతుందని న్యూట్రల్ గా ఆలోచించేవారు అంటున్న మాట.