'సలార్'ని 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'తో పోల్చిన కల్కి దర్శకుడు
కల్కి దర్శకుడి పనితనంపై అంతర్జాతీయ సినీయవనికపై పని చేస్తున్న చాలా మంది క్రియేటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.
By: Tupaki Desk | 19 July 2024 8:50 AM GMTఒకే ఒక్క సినిమాతో ప్రభంజనం అంటే ఏమిటో చూపించాడు నాగ్ అశ్విన్. ఓవర్‌నైట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ల జాబితాలో చేరాడు. రాజమౌళి-శంకర్-సుకుమార్- అట్లీ తర్వాత పాన్ ఇండియాలో గొప్ప ప్రభావం చూపించిన సౌత్ దర్శకుడిగా ఇప్పుడు నాగి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఒకరకంగా నాగి పేరు ఇంటర్నేషనల్ ఇప్పుడు. కల్కి 2898 AD విజువల్స్ ని ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ లో ఆవిష్కరించేందుకు నాగి చూపించిన క్రియేటివిటీ, హార్డ్ వర్క్ కి గొప్ప గుర్తింపు దక్కింది. కల్కి దర్శకుడి పనితనంపై అంతర్జాతీయ సినీయవనికపై పని చేస్తున్న చాలా మంది క్రియేటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే తనను ప్రపంచం ఇంతగా పొగిడేస్తుంటే, తాను మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాని పొగిడాడు. ప్రభాస్ కథానాయకుడిగా నీల్ తెరకెక్కించిన సలార్ గొప్పతనాన్ని అతడు కీర్తించిన తీరు అసమానం. ఇటీవలి ఇంటర్వ్యూలో కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'సలార్: సీజ్ ఫైర్ పార్ట్ 1 కి వరల్డ్ వైడ్ గా ప్రాచుర్యం పొందిన కల్ట్ అమెరికన్ ఎపిక్ ఫాంటసీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'(హెచ్‌బివో సిరీస్)కి మధ్య పోలికలు ఉన్నాయని అన్నాడు.
నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి గ్రాండ్ సక్సెస్ ని ఆస్వాధిస్తున్నాడు. ఇంకా 'కల్కి 2898 AD' పార్ట్ 2 పనిని ప్రారంభించలేదు. అయినా ప్రేక్షకులు, మీడియా ఆసక్తి పార్ట్ 2 పై చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒక ప్రేక్షకుడిగా 2024లో అతడు ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఏది ముందు వరుసలో ఉంది? పుష్ప 2, సలార్ 2 అంటూ ప్రశ్నించారు. ఇతర సీక్వెల్ సినిమాలు వరుసలో ఉన్నాయి. కానీ అవేవీ కాదని సలార్ 2 కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నాగ్ అశ్విన్ బదులిచ్చారు. నేను ప్రభాస్ వైపు మొగ్గు చూపుతున్నాను. పక్షపాతంతో ఉన్నను! అని కూడా అంగీకరించాడు.
ఇంటర్వ్యూలో నాగి ఇంకా ఇలా అన్నాడు. నేను సలార్‌ని 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'తో పోలుస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ టీవీ సిరీస్ గొప్ప ఇళ్ళు , కొన్ని అద్భుతమైన నాటకాలు.. పోరాటాలతో రక్తి కట్టించింది. సలార్‌లో కూడా అవన్నీ ఉన్నాయి. సలార్ లో ప్రభాస్ శత్రు ఇంటికి చెందిన వ్యక్తి అని చివరిగా వెల్లడించడం ఆశ్చర్యకరంగా ఉంది. నేను సలార్2 చూడాలనుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. అవును.. ఇది ప్రభాస్ సినిమా అని నేను కొంచెం పక్షపాతంతో ఉన్నాను. పార్ట్ 2లో 'సలార్' ప్రపంచం ఎలా తెరకెక్కుతుందనే ఉత్సుకతను నాగ్ అశ్విన్ పోలిక మరింత పెంచింది. మహేష్ ఫారెస్ట్ అడ్వెంచర్ తో రాజమౌళి, సలార్ 2తో ప్రశాంత్ నీల్, కల్కి 2898ఏడి సీక్వెల్‌తో నాగ్ అశ్విన్ మరోసారి 1000 కోట్ల క్లబ్ సినిమాలను అందించడం ఖాయమని భావిస్తున్నారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లోని పుష్ప 2 పైనా ఇదే తీరుగా భారీ అంచనాలున్నాయి.