Begin typing your search above and press return to search.

అతిథి పాత్ర‌లు ప‌నికి రావ‌ని ఎవ‌ర‌న్నారు?

అగ్ర హీరోలంద‌రినీ ఒకే సినిమా కోసం ఓ చోట చేర్చి సినిమా మార్కెట్ ని పెంచేలా ఎత్తుగ‌డ‌ను అనుస‌రించేందుకు ఇప్పుడు ఎంతో ఫ్లెక్సిబిలిటీ క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   4 July 2024 6:01 PM GMT
అతిథి పాత్ర‌లు ప‌నికి రావ‌ని ఎవ‌ర‌న్నారు?
X

చాలా కాలంగా హాలీవుడ్ బాలీవుడ్ లో అమ‌ల్లో ఉన్న ఫార్ములాని ఇప్పుడు సౌత్ సినిమా కూడా అనుస‌రిస్తోంది. అగ్ర హీరోలంద‌రినీ ఒకే సినిమా కోసం ఓ చోట చేర్చి సినిమా మార్కెట్ ని పెంచేలా ఎత్తుగ‌డ‌ను అనుస‌రించేందుకు ఇప్పుడు ఎంతో ఫ్లెక్సిబిలిటీ క‌నిపిస్తోంది.

దీనికి తాజా ఉదాహ‌ర‌ణ క‌ల్కి 2989 ఏడి. ఈ సినిమా స్టార్ కాస్టింగ్ టాలీవుడ్ స‌హా అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లోను చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ త‌ర‌హా ఎంపిక‌ల్లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఆలోచ‌నా శ‌క్తిని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేని స‌న్నివేశం ఉంది. కల్కి చిత్రంలో టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్, కోలీవుడ్ నుంచి క‌మ‌ల్ హాస‌న్, బాలీవుడ్ నుంచి అమితాబ్, దిశా, దీపిక వంటి ప్ర‌ముఖ స్టార్లు ఉన్నారు. వీరంతా సినిమా విజ‌యంలో కీల‌క భూమిక‌ను పోషించారు.

అద‌నంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్కార్ స‌ల్మాన్, ఫ‌రియా అబ్ధుల్లా ఇలా యువ‌తార‌ల‌ను అతిథులుగా జోడించ‌డం క‌ల్కి బాక్సాఫీస్ వ‌సూళ్ల‌కు క‌లిసొచ్చింద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇలాంటి ప్ర‌యోగం అరుదు. లోకేష్ క‌న‌గ‌రాజ్ విక్ర‌మ్ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్, ఫ‌హ‌ద్, విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ ట్యాలెంట్ ని ఉపయోగించుకుని ప్యాడింగ్ ఆర్టిస్టుల‌తో అద్భుతాలు చేసారు. ఇప్పుడు క‌ల్కి కోసం అంత‌కుమించి అనేలా నాగ్ అశ్విన్ ప్లానింగ్ కొన‌సాగింది. ఎంపిక చేసుకున్న క‌థ‌, క‌థ‌నాల‌కు త‌గ్గ‌ట్టు అతిథి పాత్ర‌లు కూడా క‌ల్కిలో అద్భుతంగా సెట్ట‌య్యాయి. ఇవి ఇరికించిన పాత్ర‌ల్లా క‌నిపించ‌క‌పోవ‌డం గ్రేట్.

నిజానికి అతిధి పాత్రలను చేర్చడం చిత్ర పరిశ్రమలో ఐక్యత మద్దతుల‌ను ఆవిష్క‌రించింది. సినిమాలోని చిన్న‌పాటి క్లుప్తమైన పాత్ర‌ల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలను ప్రేక్షకులు నిజంగా ఆస్వాధించారు. ఈ అతిధి పాత్రలు చిన్నవిగా ఉన్నప్పటికీ ఓవ‌రాల్ గా అద్భుతాలు చేసాయి. ఆస‌క్తిక‌రంగా ఈ పాత్రలలో కొన్ని త‌దుప‌రి కల్కి సీక్వెల్‌లో కూడా కనిపిస్తాయని హింట్ అందింది. ఆ ర‌కంగా అతిథి పాత్ర‌లు క‌లిసొచ్చాయ‌ని చెప్పాలి.

కొంతమంది వీక్షకులు ఈ అతిధి పాత్రలు ప్రత్యేకించి ప్రభావం చూప‌లేవ‌ని, కథాంశానికి అవసరమైనవి కావని కూడా నమ్ముతారు. కానీ 600కోట్ల బ‌డ్జెట్ సినిమాలో అవ‌స‌రం మేర మాత్ర‌మే ఈ అతిథి పాత్ర‌ల‌ను దర్శ‌కుడు జోడించారు.