Begin typing your search above and press return to search.

కల్కి2898ఏడీ… టెస్ట్ షూట్ లో ఎవరు చూడని పిక్

రెండు సినిమాల అనుభవంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ ఇండియన్ సినిమాగా కల్కిని నాగ్ అశ్విన్ తెరకెక్కించి ప్రశంసలు సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2024 12:07 PM GMT
కల్కి2898ఏడీ… టెస్ట్ షూట్ లో ఎవరు చూడని పిక్
X

కల్కి2898ఏడీ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇండియన్ మైథాలజీ కథాంశంకి పెద్దపీట వేసి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఈ మూవీ కథని చెప్పడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికే 900+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ వెయ్యి కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో మరో హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా ఈ మూవీ నిలవబోతోంది.


కల్కి 2898ఏడీతో ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డులని ప్రభాస్ సొంతం చేసుకున్నారు. రెండు సినిమాల అనుభవంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ ఇండియన్ సినిమాగా కల్కిని నాగ్ అశ్విన్ తెరకెక్కించి ప్రశంసలు సొంతం చేసుకున్నారు. నాగ్ అశ్విన్ టేకింగ్ కి లెజెండరీ యాక్టర్స్ అయిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటివారు ఫిదా అయిపోయారంటే నాగ్ కల్కి మూవీ కథపై ఎంత వర్క్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ అయిన రాజేంద్రప్రసాద్, శోభన కీలక పాత్రలలో నటించారు. మరియం అనే క్యారెక్టర్ లో శోభన సినిమాలో కనిపించారు. భగవంతుడి రాకకోసం ఎదురుచూసే శంబాలా స్త్రీగా ఆమె కనిపిస్తుంది. శోభన పాత్ర నిడివి సినిమాలో తక్కువగా ఉన్న కూడా మంచి పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా నాగ్ అశ్విన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో శోభన లుక్ టెస్ట్ పిక్స్ ని షేర్ చేసుకున్నాడు.

లుక్ టెస్ట్ కోసం తీసుకున్న తన అభిమాన నటి మొదటి ఫోటో ఇదే అని నాగ్ అశ్విన్ షేర్ చేశారు. ఈ ఫోటోలో శోభన కాళ్ళకి గజ్జెలు కడుతున్నట్లు ఉంది. ఈ ఫోటోని షేర్ చేసిన నాగ్ అశ్విన్ శోభన మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే కల్కి మూవీ సక్సెస్ తో నాగ్ అశ్విన్ పైన మరింత బాధ్యత పెరిగిందని చెప్పాలి.

కల్కి 2898ఏడీ మూవీ క్యారెక్టరైజేషన్స్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిగణంలోకి తీసుకొని పార్ట్ 2లో అర్ధవంతమైన ముగింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా కల్కి జననం కూడా జరగలేదు. పార్ట్ 2లో కల్కి పుట్టుక వరకు కథ ఉండే ఛాన్స్ ఉంది. ఆ పైన క్యారెక్టర్ బేస్ చేసుకొని ఈ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 మూవీ కూడా చేయాల్సి ఉంటుంది. వీటిని నాగ్ అశ్విన్ ఇప్పుడు ఎలా డీల్ చేస్తాడనేది తెలియాల్సి ఉంది.