Begin typing your search above and press return to search.

నాగీ... కల్కి క్లైమాక్స్ లో ఇచ్చిన సర్ ప్రైజ్ షాక్ అన్యాయం బాస్!

నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న కల్కి మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తుంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 4:30 AM GMT
నాగీ... కల్కి క్లైమాక్స్ లో ఇచ్చిన సర్ ప్రైజ్ షాక్ అన్యాయం బాస్!
X

నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న కల్కి మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను అనౌన్స్ చేసిన నాటి నుంచి రిలీజ్ అయ్యే రెండు రోజుల ముందు వరకు కూడా ఈ భారీ చిత్రం పార్టు 1 మాత్రమేనని.. దాని కొనసాగింపు మరో భాగమా? లేదంటే రెండు భాగాలు ఉంటాయా? అన్న దాని మీద సగటు ప్రేక్షకుడికి ఎలాంటి క్లూ లేదు. సినిమా విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు కల్కి ప్రపంచంలో ఈ మూవీ ఒక భాగమన్న విషయాన్ని చెప్పినప్పటికీ.. పార్టు 1 మీద క్లారిటీ ఇవ్వని పరిస్థితి.

సినిమా ఆరంభం మొదలు ఇంటర్వెల్ సీన్ వరకు వచ్చేసరికి స్టోరీలోకి వెళుతున్నట్లు అనిపించినా.. ఇంటర్వెల్ తర్వాత సమయం గడిచిపోతున్నా.. క్లైమాక్స్ వచ్చే సూచనలు కనిపించవు. సరిగ్గా.. అదిరే వరుస సీన్లతో ప్రేక్షకుడు పూర్తిగా సినిమాలోకి లీనమైన వేళ.. సినిమా పార్టు వన్ మాత్రమేనని.. రెండో పార్టు ఉందన్న విషయం థియేటర్లో కూర్చున్న చాలామందికి అప్పుడే రివీల్ అయ్యే పరిస్థితి.

పార్టుల చొప్పున సినిమాను తీస్తున్న విషయాన్ని తొలుతే చెప్పేయటం.. ప్రేక్షకుడ్ని మెంటల్ గా రెఢీ చేయటం లాంటివేమీ చేయని చిత్ర దర్శకుడు నాగ్ ఆశ్విన్.. ఒక్కసారిగా సర్ ప్రైజ్ షాకిస్తాడు. తన సినిమాలో పలు అతిధి పాత్రల వచ్చి సందడితో పాటు.. సర్ ప్రైజ్ చేస్తున్న దానికి కొనసాగింపుగా సినిమా చివర్లో పార్టు 2 కోసం వెయిట్ చేయడంటూ ఫైనల్ షాకిచ్చి థియేటర్ల నుంచి బయటకు పంపిస్తాడు. దీంతో కల్కి మూవీ ఫుల్ మీల్స్ అన్న ఫీలింగ్ తో వచ్చే సినిమా ఫస్ట్ షో చూసే అత్యధికులకు కూసింత నిరాశను మిగిల్చారనే చెప్పాలి. కల్కి మూవీ అంతా బాగున్నా.. చివర్లో ఈ మూవీకి సంబంధించిన ట్విస్టు మాత్రం అన్యాయం బాస్ అన్న మాట పలువురి నోట వినిపించింది.