Begin typing your search above and press return to search.

దేవర ఫ్యాన్ వార్స్.. నాగవంశీ ఏమన్నారంటే..

అభిమానులు తమ తమ హీరోల మీద ప్రేమతో చిన్న చిన్న వాగ్వాదాలతో సోషల్ మీడియాలో హడావుడి చేయడం సర్వసాధారణం.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:41 AM GMT
దేవర ఫ్యాన్ వార్స్.. నాగవంశీ ఏమన్నారంటే..
X

అభిమానులు తమ తమ హీరోల మీద ప్రేమతో చిన్న చిన్న వాగ్వాదాలతో సోషల్ మీడియాలో హడావుడి చేయడం సర్వసాధారణం. కానీ మరికొన్ని రోజుల్లో రానున్న దేవర సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పంచాయతీలు మితి మీరాయి. ఫ్యాన్ వార్స్ ఇప్పుడు మరింత ఉధృతంగా మారాయి. లక్షల మంది అభిమానులు అనవసర కాంట్రవర్సీలకు ఆజ్యం పోస్తున్నారు. కేవలం దేవర మాత్రమే కాదు, ఇతర పెద్ద సినిమాలూ ఈ ట్రెండ్ కు బలవుతున్నాయి.

సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదో ఒక సినిమాని టార్గెట్ చేసుకుని మాటలతో యుద్ధాలు చేయడం, తప్పుడు ప్రచారాలు సాగించడం కామన్ గా మారింది. ఇక ఎక్కడో ఒక చోట పరిస్థితి అదుపుతప్పుతోంది. ఇక ఇదే సమయంలో నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు, అవగాహన కలిగిన వ్యక్తులు అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన అభిమానులకు ఇచ్చిన ఒక సందేశం ఆలోచింపజేసే విధంగా ఉంది.

అభిమానుల మధ్య జరిగే ఈ వాదనలు సినిమాలకి అనవసరమైన నెగటివిటీని తీసుకొస్తాయని, చివరకు ఇష్టమైన హీరోల సినిమాల మీదే దుష్ప్రభావం చూపిస్తాయని ఆయన హెచ్చరించారు. సినిమాలు ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో ఉంటాయి, అయితే అసంబద్ధమైన వివాదాలతో వాటికి చెడ్డ పేరు తేవడం ఎవరికీ మంచిది కాదు.

ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ యుద్ధాలకు ఒక పరిష్కారం అనేది ఉండదు. సోషల్ మీడియా వేదికలు మాటల యుద్ధాలకు కాదు, సినిమా మీద సంతోషాన్ని పంచుకోవడానికి ఉపయోగపడితే మంచిదని స్పష్టంగా తెలిపారు. ఒకరి సినిమాని టార్గెట్ చేస్తే అది అన్ని సినిమాలకీ వ్యతిరేకంగా పరిణామాల్ని తీసుకొస్తుంది. అభిమానుల మధ్య విబేధాలు వ్యక్తిగత స్వభావానికి పోకూడదు అని సితార అధినేత తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

నగవంశీ దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను ఆయన భారీ ధరకు కొనుగోలు చేశారు. ఇక దేవర సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ సాలీడ్ గా ఉన్నాయి. మొదటి రోజే ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే సినిమాగా దేవర నిలవనున్నట్లు అర్ధమవుతుంది. ఇక సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సరికొత్త రికార్డులు నమోదవుతాయని చెప్పవచ్చు.