Begin typing your search above and press return to search.

GOG: ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా తన స్పీచ్‌తో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

By:  Tupaki Desk   |   28 May 2024 5:21 PM GMT
GOG: ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు
X

విశ్వక్ సేన్ - డైరెక్టర్ కృష్ణ చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ఈనెల 31వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ వారి మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా తన స్పీచ్‌తో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ముందుగా నందమూరి బాలకృష్ణ 109వ సినిమా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. "జూన్ 16వ తేదీన మరొకటి ప్లాన్ చేస్తున్నాం, పూనకాలు రావడం గ్యారెంటీ," అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే, "నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయింది. రామారావు గారు నా లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అంటే, సితార ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్క్రీన్ మీద పడినప్పుడు రామారావు గారి శంఖం ఉదితేనే ఆ బ్యానర్ పడుతుంది. నా లైఫ్‌లో ఆయన అంత ఇంపార్టెంట్.

రామారావు గారి పుట్టినరోజున ఒక ఫంక్షన్ చేసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఈరోజు విశ్వక్ దయవల్ల నాకు అది కుదిరింది. ఇదేరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ సార్. ఇక సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత రెవెన్యూ తెస్తుంది అనే వాటి గురించి నేను మాట్లాడలేను.

కానీ మే 31 తర్వాత విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకుంటారు. విశ్వక్ సేన్ కెరియర్‌లో బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మాట్లాడుకుంటారు. నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో యాక్టింగ్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మా డైరెక్టర్ కృష్ణ చైతన్య కూడా ఎంతో బాగా వర్క్ చేశారు. అందరూ షాక్ అయ్యేలా అతను తెరపై సినిమాను చూపించాడు. నేనే షాక్ అయ్యాను.

ఈ మధ్యకాలంలో ఇంత ఇంటెన్స్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాలేదు. అలాగే మా రాధిక ఇందులో ఫస్ట్ టైం డిగ్లామ్ రోల్ చేసింది. ఇందులో చాలా క్యూట్‌గా కనిపించింది. రాధిక పాత్రకు రివర్స్‌గా ఊహించుకుని అందరూ థియేటర్లోకి రావాలి. అంత పద్ధతిగా ఈ సినిమాలో ఉంటుంది. ఇక ఈ సినిమాలో అంజలి గారు కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆమె కనిపించినప్పుడల్లా స్క్రీన్‌లో ఒక ప్రత్యేకమైన వైబ్ ఏర్పడింది. అంతలా ఆమె పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కూడా ఆర్ఆర్ తో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాడు. అతను ఆర్ఆర్ అయితే ఇరగదీసేశాడు. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని నమ్మకంగా చెప్పగలను. ఇక బాలకృష్ణ గారు కూడా మాకు సపోర్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు కూడా ఇదే తరహాలో మద్దతు అందిస్తారు అని కోరుకుంటున్నట్లు వంశీ మాట్లాడారు.