Begin typing your search above and press return to search.

జాన్వీని చూస్తే ముద్దొస్తుంది: నిర్మాత నాగవంశీ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''దేవర''.

By:  Tupaki Desk   |   6 Aug 2024 9:09 AM GMT
జాన్వీని చూస్తే ముద్దొస్తుంది: నిర్మాత నాగవంశీ
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''దేవర''. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే నెలాఖరున విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. నిన్న సోమవారం సాయంత్రం మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు. 'చుట్టమల్లే' అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో ఇతర పాటలతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. దీనిపై నిర్మాత నాగవంశీ ఎక్స్ లో పోస్ట్ పెడుతూ, ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు.

'దేవర' సాంగ్ గురించి ఎవరేం అనుకుంటే ఏమీ, మనకి పాట నచ్చింది కదా బాయ్స్‌ అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ పోస్ట్ చేసారు. ''చుట్టమల్లే పాట గత 24 గంటల నుండి లూప్‌లో ఉంది. జోష్ ఎలా ఉంది అబ్బాయిలూ?. తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తుంది, జాన్వీని చూస్తుంటే ముద్దు వస్తుంది. ఇంక ఎవరు ఎలా అనుకోని, దేంతో కంపేర్ చేస్తే మనకేంటి బాయ్స్...'' అని నిర్మాత పేర్కొన్నారు. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. 'సరిగ్గా చెప్పావ్ అన్నా' అని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు మాత్రం 'జాన్వీని చూస్తే ముద్దొస్తుందా.. ఆహా' అంటూ మీమ్స్ పెడుతున్నారు.

ఎన్టీఆర్ కు సితార నాగవంశీ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో ఆయన మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. తారక్ తో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాని కూడా నిర్మించారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లోనే మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు కానీ, అది క్యాన్సిల్ అయింది. అప్పుడే కొరటాల శివ సినిమా లైనప్ లో ముందుకు వచ్చింది. అయినా సరే ఎప్పటికైనా ఎన్టీఆర్ తో ఓ భారీ మూవీ తీస్తామని నాగవంశీ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 'దేవర 1' సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ పై జరుగుతున్న ట్రోలింగ్ కు కౌంటర్ ఇచ్చారు.

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల మీద చిత్రీకరించిన రొమాంటిక్ మెలోడీ సాంగ్ 'చుట్టమల్లే'. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. పిక్చరైజేషన్ కూడా కలర్ ఫుల్ గా చాలా బాగుంది. ఇది ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తోంది. అందుకే విడుదలైనప్పటి నుంచీ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలుపుకొని 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

'చుట్టమల్లే' సాంగ్ కు అనిరుధ్ రవిచందర్ ట్యూన్ కంపోజ్ చేయడా.. సింగర్ శిల్పా రావు ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి తెలుగు లిరిక్స్ రాసారు. ఈ పాటకు బోస్కో మార్టిస్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేసారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న 'దేవర 1' చిత్రం.. సెప్టెంబర్‌ 27న తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.