Begin typing your search above and press return to search.

మోహన్ లాల్ తో సితార వంశీ.. సడన్ సర్ ప్రైజ్!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.

By:  Tupaki Desk   |   21 May 2024 1:48 PM GMT
మోహన్ లాల్ తో సితార వంశీ.. సడన్ సర్ ప్రైజ్!
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ అత్యధిక సంఖ్యలో సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు అధిపతిగా ఉన్న సితార నాగవంశీ తన వ్యూహాత్మకమైన ప్రాజెక్టులతో వరుస విజయాలను అందుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఇటీవల విడుదలైన "సార్" మరియు "మ్యాడ్" సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

"టిల్లు స్క్వేర్" వంటి సినిమాతో భారీ వసూళ్లు రాబట్టి సితార ఎంటర్టైన్మెంట్స్ పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే చిత్రం మే 17న విడుదల కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఎంత బిజీగా ఉన్నా కూడా నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా మలయాళం స్టార్ మోహన్ లాల్ ను కలిసి నాగ వంశీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి కూడా వెళ్లారు. లెజెండరీ యాక్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు.

అలాగే మోహల్ లాల్ దర్శకత్వంలో రాబోతున్న బెరోజ్ సినిమాను కూడా ప్రస్తావిస్తూ ఆ సినిమాతో మంచి విజయం అందుకోవాలి అని కోరుకున్నారు. మరి రాబోయే రోజుల్లో మోహల్ లాల్ తో కూడా సినిమా చేస్తారేమో చూడాలి. మరోవైపు మోహన్ లాల్ తెలుగులో కన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక సితార వారి విషయానికి వస్తే మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో రూపొందుతున్న NBK 109 మూవీ కూడా సితార బ్యానర్ పైనే వస్తోంది. ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విజయ్ దేవరకొండ VD 12, కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్, గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్, భాను-రవితేజ చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ వంటి పలు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి.