Begin typing your search above and press return to search.

బీచ్ లో ప‌డ‌గ విప్పిన నాగిని!

ఇదిగో ఇక్క‌డిలా ప‌డ‌గ విప్పిన త్రాచు పాములా కుర్రాళ్ల‌పై విషం చిమ్ముతోన్న వైనం పై ఓ లుక్ వేయాల్సిందే

By:  Tupaki Desk   |   23 Dec 2023 1:38 PM GMT
బీచ్ లో ప‌డ‌గ విప్పిన నాగిని!
X

మౌనీరాయ్ అలియాస్ నాగిని టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టికప్పుడు హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు దిశాప‌టానీతో క‌లిసి వెకేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండు..మూడు రోజులుగా బీచ్ నుంచి ఒక్కో భంగిమ నెట్టింట వ‌దులుతుంది. స్విమ్ షూట్ లో మ‌త్తెక్కించే భంగిమ‌ల‌తో యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. తాజాగా అమ్మ‌డు అదే సిరీస్ నుంచి మ‌రో హాట్ ఫోటో నెట్టింట వ‌దిలింది.


ఇదిగో ఇక్క‌డిలా ప‌డ‌గ విప్పిన త్రాచు పాములా కుర్రాళ్ల‌పై విషం చిమ్ముతోన్న వైనం పై ఓ లుక్ వేయాల్సిందే. ఉద‌యాన్నే అమ్మ‌డు ఇలా సూర్యుడికి ఎదురుగా నిల‌బ‌డి ఆస‌నాలు వేస్తుంది. చేతి వేళ్ల నుంచి కాలి వేళ్ల వ‌ర‌కూ ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం కోసం ఇలా ఆస‌నం వేసింది. అమ్మ‌డి బ్యాక్ లెస్ అంతే అందంగా ఆక‌ట్టుకుంటుంది. బీచ్ వేర్ లో నాగిని అందాల్లో చిత్తు అవ్వాల్సిందే అనిపిస్తుంది.


ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. మౌనీరాయ్ బ్యూటీకి అంతా ఫిదా అవుతున్నారు.


మౌని రాయ్ మల్టీట్యాలెంటెడ్. మోడలింగ్ నుంచి అటుపై గాయనిగా..నటిగా ఫేమస్ అయింది. సినిమాలకన్నా టీవీషోలతోనే మౌనీరాయ్ బాగా ఫోకస్ అయింది. పాప్ ఆల్బమ్ సింగర్ గానూ మౌనీరాయ్ శ్రోత‌ల్ని అల‌రించింది. అయితే నటిగా మాత్రం ఇప్పుడిప్పుడే నిల‌దొక్కుకుంటుంది.


బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటీకీ ఇంకా ఫేంని తీసుకురాలేదు. స‌రైన స‌క్సెస్ ప‌డితే అమ్మ‌డి కెరీర్ కి తిరుగుండ‌దు. ఆ ర‌క‌మైన స‌క్సెస్ కోసం ఎదురుచూస్తోంది. `కేజీఎఫ్` చాప్టర్ -1లో స్పెషల్ అప్పీరి యన్స్ తో సౌత్ లో పేరొచ్చింది. ఇప్పుడా క్రేజ్ ని నిల‌బెట్టుకునే అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది. ఈ ప్రాస‌స్ లో నెట్టింట అంత‌కంత‌కు పాపులారిటీ రెట్టింపు చేసుకుంటుంది.