మెగాస్టార్ తో హీరోయిన్ గొడవ పడిందా?
ఇద్దరి మధ్యా సన్నివేశాలు ఎంత రక్తికట్టిస్తాయో! డాన్సు విషయంలోనూ హీరోకి ధీటుగా వేసిది నగ్మా.
By: Tupaki Desk | 30 Jun 2024 9:29 AM GMTమెగాస్టార్ చిరంజీవి మీద హీరోయిన్ అలిగిందా? అలిగి సెట్ నుంచి వెళ్లిపోయిందా? ఫలితంగా చిరు బ్రతిమలాడాల్సి వచ్చిందా? అంటే అవుననే తెలుస్తోంది. చిరంజీవి-నగ్మ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఘరానా మొగుడు', 'రిక్షావోడు', 'ముగ్గురు మొనగాళ్లు'లాంటి హిట్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్యా సన్నివేశాలు ఎంత రక్తికట్టిస్తాయో! డాన్సు విషయంలోనూ హీరోకి ధీటుగా వేసిది నగ్మా.
అయితే 'రిక్షావోడు' సినిమా షూటింగ్ సమయంలో నగ్మా, చిరంజీవి మద్య వివాదం జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో నగ్మ పొగరబోతు అమ్మాయి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే పాట షూటింగ్ సమయంలో చిరుతో చిన్నపాటి గొడవ పడిందిట. దీంతో నగ్మ అలిగి అక్కడ నుంచి అప్పటికప్పుడు రామానాయుడు స్టూడియో నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిందిట.
అలా వెళ్లిపోయే సమయంలో దర్శక, నిర్మాతలు బ్రతిమలాడినా మాట వినిపించుకోలేదుట. దీంతో లాభం లేదనుకుని చిరంజీవి కూడా ఆమెని బుజ్జగించే ప్రయత్నం చేసారుట. కాసేపు ఆయన మాట కూడా వినలేదుట. చివరికి రాజీకొచ్చి నవ్వుకుంటూ షూటింగ్ లో జాయిన్ అయిందిట. అంతమంది చెప్పినా వినకపోయినా చిరంజీవి ఒక్క మాట చెప్పేసరికి ఎలా ఒప్పుకుంది? అంటూ అప్పటి మీడియాలో పెద్ద చర్చే సాగిందిట.
అయితే చిరంజీవి ఆమెకి ఏం చెప్పి ఒప్పించారు? అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదంటున్నారు. ఒకవేళ తెలిసినా ఆ సినిమా దర్శక-నిర్మాతలకు ఎవరికైనా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నా, నగ్మ మాత్రం రిటైర్మెంట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో కి వస్తుంటారు. అదీ చాలా రేర్ గా జరుగుతుంది.