Begin typing your search above and press return to search.

నాగార్జున ఈసారి డైరెక్టర్ సొంత కథతో..?

ఆ సినిమా డైరెక్షన్ లో ఫుల్ మార్కులు పడ్డాయి కాబట్టి కచ్చితంగా నాగార్జున విజయ్ బిన్ని సొంత కథతో కూడా సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   5 March 2024 4:30 PM GMT
నాగార్జున ఈసారి డైరెక్టర్ సొంత కథతో..?
X

కింగ్ నాగార్జునతో నా సామిరంగ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ విజయ్ బిన్ని. కొరియోగ్రాఫర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన అతను సడెన్ గా మెగా ఫోన్ పట్టుకోవాలని ఎందుకు అనిపించిందో కానీ నాగార్జునను కలిసి ఒక కథ చెప్పగా ఆ కథ ఓకే కానీ మలయాళంలో హిట్టైన పొరింజు మరియం జోస్ సినిమా చూపించి దీన్ని తెలుగులో తీద్దాం నీ వెర్షన్ తీసుకుని రా అని నాగార్జున చెప్పాడట.

అలా ఆ సినిమాను మరో రైటర్ కి కూడా ఇవ్వడం విజయ్ బిన్ని వెర్షన్ కాస్త కొత్తగా ఉండటంతో అతనితో సినిమా చేయడం జరిగింది. విజయ్ బిన్ని డైరెక్టర్ గా తొలి సినిమానే హిట్ అందుకున్నడు. అయితే రీమేక్ కథతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు సొంత కథతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అసలు నాగార్జునకు తన సొంత కథతోనే సినిమా చేయాలనే ప్రపోజల్ తో వెళ్లాడు కానీ రీమేక్ ఇచ్చి చేయమన్నారు.

ఆ సినిమా డైరెక్షన్ లో ఫుల్ మార్కులు పడ్డాయి కాబట్టి కచ్చితంగా నాగార్జున విజయ్ బిన్ని సొంత కథతో కూడా సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జున ధనుష్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా తన 100వ సినిమా ప్లానింగ్ లో కూడా ఉన్నాడు. హిట్ ఇచ్చిన విజయ్ బిన్నితోనే మరో సినిమా చేయాలని ఉన్నా మధ్యలో మరో సినిమా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

మరి నాగార్జున 100వ సినిమా ఏ డైరెక్టర్ చేతిలో పెడతాడు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున నా సామిరంగ తో తిరిగి ఫాం లోకి రావడం పండుగ చేసుకుంటున్నారు. ఇదే జోష్ లో వరుసగా క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తే చూడాలని అనుకుంటున్నారు. రాజమౌళి మహేష్ కాంబో సినిమాలో నాగార్జున కూడా ఉంటాడని ఇన్నర్ టాక్. అదే నిజమైతే మాత్రం నాగార్జున కూడా ఆ సినిమాకు హైలెట్ అంశాల్లో ఒకరిగా ఉంటారని చెప్పొచ్చు. నా సామిరంగ సక్సెస్ మీట్ లో ఇక మీదట ప్రతి సంక్రాంతికి సినిమాతో వస్తానన్నారు. వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమాతో వస్తానని చెప్పారు. మరి ఇంతవరకు నాగార్జున నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి నెక్స్ట్ సంక్రాంతికి ఏ సినిమా చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.