'నల జీలకర మొగ్గ' - ఊర మాస్ బీట్ వచ్చేసిందోచ్
ఆమె పాడిన ఎన్నో జానపద గీతాల్లో నల జీలకర మొగ్గ ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాటలో ఉత్తరాంధ్ర పల్లెటూరి వాతావరణం, సాంస్కృతిక మూలాలు స్పష్టంగా కనిపిస్తాయి.
By: Tupaki Desk | 10 Jan 2025 11:37 AM GMTగరివిడి లక్ష్మి అనే పేరు ఒకప్పుడు ఉత్తరాంధ్రలో జానపద గీతాలకు చాలా ఫేమస్. ఆ సౌండ్ లోకల్ జనాలని ఒకప్పుడు ఊరమాస్ తో ఒక ఊపు ఉపేసింది. ఇక 1990లలో ఆమె బుర్ర కథలతో జానపద గీతాలకు ప్రాచుర్యం తీసుకువచ్చి, ఉత్తరాంధ్ర సంస్కృతిని దేశవ్యాప్తంగా పరిచయం చేశారు. ఆమె పాడిన ఎన్నో జానపద గీతాల్లో నల జీలకర మొగ్గ ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాటలో ఉత్తరాంధ్ర పల్లెటూరి వాతావరణం, సాంస్కృతిక మూలాలు స్పష్టంగా కనిపిస్తాయి.
మంచి కంటెంట్ ఉండే సినిమాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ గరివిడి లక్ష్మి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన నల జీలకర మొగ్గ పాటను విడుదల చేశారు. ఈ పాట మహిళలోని అంతర్గత అందాన్ని, ఆమె ఆకర్షణను ఆభరణాలు, చీరల కంటే మెరుగ్గా చూపించింది. పాట వినగానే ఎవరైనా పల్లెటూరి అనుభవానికి లోనవుతారు. ఈ పాటలో వినిపించే సాహిత్యం, ఉత్సాహభరితమైన సంగీతం శ్రోతలను అలరిస్తున్నాయి.
చరణ్ అర్జున్ స్వరపరిచిన ఈ పాటను అనన్య భట్, జానకి రామ్ గౌరీ నాయుడు ఆలిపించారు. ఇక ఈ సినిమాలో గరివిడి లక్ష్మిగా నటిస్తున్న ఆనంది పర్ఫెక్ట్ ఛాయిస్ అని మేకర్స్ చెబుతున్నారు. ఉత్తరాంధ్ర పల్లెటూరి కథానికను ప్రాధాన్యంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమా జానపద నేపథ్యానికి న్యాయం చేస్తుందనే భావన చిత్రబృందంలో నెలకొంది. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని విడుదల చేసిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.
మన పల్లెటూరి సంస్కృతిని ప్రతిబింబించే ఈ పాట పండుగ శోభను మరింత పెంచుతోంది. పాటలోని మాస్ బీట్స్ ప్రతి ఒక్కరి ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఇక గరివిడి లక్ష్మి చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. చరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. జానపదానికి సరికొత్త హంగులు అద్దే ప్రయత్నంలో ఈ సినిమా చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ద్వారా మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి. సంక్రాంతి అనంతరం సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ కూడా ఇవ్వనున్నారు.