Begin typing your search above and press return to search.

మహేష్ బర్త్ డే.. నమ్రత రొమాంటిక్ మూమెంట్

తాజాగా ఆమె మహేష్ ని వెనక నుంచి హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం.

By:  Tupaki Desk   |   9 Aug 2023 5:58 AM GMT
మహేష్ బర్త్ డే.. నమ్రత రొమాంటిక్ మూమెంట్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.కాగా, ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావడంతో, సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. అయితే, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ మరింత డిఫరెంట్ గా మహేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.





మహేష్ కానీ, నమ్రత కానీ, వారి పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడెప్పుడో నమ్రతను కిస్ చేస్తున్న ఫోటోని మహేష్ షేర్ చేశారు. తాజాగా ఆమె మహేష్ ని వెనక నుంచి హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం.ఫోటో చాలా రొమాంటిక్ గా ఉంది. మహేష్ ని ఆమె ప్రేమగా ఎంబీ అని పిలుచుకుంటారు. క్యాప్షన్ లోనూ అలానే ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ మూవీ నుంచి తాజాగా మహేష్ లుక్ ని తెలియజేసేలా ఓ ఫోటో విడుదల చేశారు. అందులో ఆయన సూపర్ మాస్ గా కనిపిస్తున్నాడు. లుంగీ కట్టి, చేతిలో బీడీ పట్టుకొని ఉండగా, ఫ్యాన్స్ కి ఈ పోస్టర్ తెగ నచ్చేసింది.

అయితే, ఈ మూవీ విషయంలో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా , కనీసం షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేకపోయింది. హీరోయిన్ మారడం వల్ల మరింత ఆలస్యమౌతూ వస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా ఉండాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆమ ఈ మూవీ నుంచి తప్పుకుంది. దీంతో, శ్రీలీల సెకండ్ హీరోయిన్ నుంచి మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది.

కాగా, మహేష్ బర్త్ డేకి కూడా కనీసం టీజర్, ట్రైలర్ ఉంటుందని అనుకున్నారు. కనీసం సాంగ్ అయినా ఉంటుందని భావించారు. కానీ, అవేమీ లేకుండా సింపుల్ గా ఓ పోస్టర్ విడుదల చేయడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా, మహేష్ మాత్రం తన పుట్టిన రోజుని ఫ్యామిలీతో ఫారిన్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.