Begin typing your search above and press return to search.

రామాయ‌ణకు ఆస్కార్ వస్తుందంటోన్న నిర్మాత‌!

నితేష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రామాయ‌ణం తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 March 2025 5:59 AM GMT
రామాయ‌ణకు ఆస్కార్ వస్తుందంటోన్న నిర్మాత‌!
X

నితేష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రామాయ‌ణం తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. రామ‌య‌ణ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రా ఎంగో గొప్ప‌గా చెప్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా రామాయ‌ణం గొప్ప‌త‌నం తెలియాల‌నే టార్గెట్ తోనే రామాయ‌ణ ను రూపొందిస్తున్నట్టు ఆయ‌న తెలిపారు.

రామాయ‌ణ‌కు ఆస్కార్ వ‌స్తుందా అని న‌మిత్‌కు ఎదురైన ప్ర‌శ్న‌కు ఆయ‌న స్పందించారు. విజువ‌ల్స్ కీల‌కంగా ఉండ‌నున్న ఈ సినిమా క‌చ్ఛితంగా ఆస్కార్ సాధించ‌గ‌ల‌ద‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని, ఇంకా చెప్పాలంటే ఒక సినిమా విజ‌య‌మ‌నేది మ‌న మీదే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఆయ‌న అంటున్నారు. సినిమాను మ‌నం ఏ రేంజ్ లో ప్ర‌మోట్ చేస్తామ‌నే దానిపైనే స‌క్సెస్ డిపెండ్ అవుతుంద‌ని, సినిమాకు ప్ర‌మోష‌న్స్ చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

మొన్నామ‌ధ్య ఏ స్టార్ హీరో రామాయ‌ణం క‌థ‌ను తీస్తే ఆ సినిమా విమ‌ర్శ‌ల పాలైంద‌ని, దాన్ని దృష్టిలో పెట్టుకునే రామాయ‌ణ విష‌యంలో తామెన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు ఆయ‌న‌ వెల్ల‌డించారు. రామాయ‌ణం లాంటి క‌థ‌ను తెర‌కెక్కించే అవ‌కాశం అంద‌రికీ రాద‌ని, అందుకే ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తినకుండా దీన్ని జాగ్ర‌త్త‌గా రూపొందిస్తున్న‌ట్టు న‌మిత్ తెలిపారు.

దేశం గ‌ర్వించేలా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ సెలబ్రేట్ చేసుకోవాల‌ని, హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమ‌ర్ కు ఎలాంటి గుర్తింపు ద‌క్కిందో అలాంటి గుర్తింపే ఈ రామాయ‌ణ‌కు కూడా రావాల‌ని, ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ద‌క్క‌డ‌మే త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని, ఈ మూవీతో హిస్ట‌రీ క్రియేట్ చేయ‌గ‌ల‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు నిర్మాత నమిత్.

ఇండియన్ సినిమాల్లో మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో రాముడుగా ర‌ణ్‌బీర్ క‌పూర్ క‌నిపించ‌నుండ‌గా, సీత‌గా సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ రావ‌ణాసురుడి పాత్ర‌లో, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడిగా, శూర్ప‌ణ‌ఖ‌గా ర‌కుల్ ప్రీత్ న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ రామాయ‌ణ మొత్తం రెండు పార్టులుగా రిలీజ్ కానుంది. ఫ‌స్ట్ పార్ట్ వ‌చ్చే ఏడాది 2026లో, సెకండ్ పార్ట్ 2027లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సంద‌ర్భంగా న‌మిత్ కామెంట్ చేసిన సినిమా ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ అనే విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు న‌మిత్ మ‌ల్హోత్రాతో పాటూ హీరో య‌ష్ కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.