Begin typing your search above and press return to search.

పండగపూట నమితకు మధుర మీనాక్షి గుడిలో చేదు అనుభవం..

నమిత గురించి ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోయినా 90 దశకంలో వారికి బాగా పరిచయం ఉండే ఉంటుంది.

By:  Tupaki Desk   |   26 Aug 2024 11:30 AM GMT
పండగపూట నమితకు మధుర మీనాక్షి గుడిలో చేదు అనుభవం..
X

నమిత గురించి ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోయినా 90 దశకంలో వారికి బాగా పరిచయం ఉండే ఉంటుంది. సొంతం, జెమిని లాంటి సినిమాలతో కుర్ర కారు మదిలో నిద్ర లేకుండా చేసిన ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో గబక్కుని గుర్తుపట్టలేని విధంగా ఉంది. టాలీవుడ్ లో ఆమె వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన నమిత ఆ తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరమైంది. అనంతరం ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయిన నమిత ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్ళిన తమ కుటుంబానికి ఎదురైన ఈ సంఘటన చాలా బాధ కలిగించింది అంటూ ఆమె ఎమోషనల్ గా ఓ వీడియోని కూడా పోస్ట్ చేశారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కొందరు ఒకప్పటి నటీనటులు అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నటి నమిత కూడా ఇదే రకంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన ఆమెను అడ్డుకున్నారు అంటూ నమిత పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తమిళనాడులో మధుర మీనాక్షి అమ్మవారి గుడి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ గుడిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు నియమ నిబంధనలను కూడా గట్టిగా పాటిస్తారు. అయితే అనుకోకుండా ఈరోజు గుడికి వెళ్లిన నమితను హిందూ కుల ధ్రువీకరణ పత్రం చూపించాల్సిందిగా కోరుతూ సిబ్బంది అటకాయించారట.

అన్యమతస్తులకు దర్శనంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని.. వాటిని మాత్రమే తాము ఫాలో అవుతామని అధికారులు చెప్పారని నమిత ఆవేదన వ్యక్తం చేశారు.

నా పెళ్లి తిరుమలలో జరిగింది.. నేను పుట్టుకతో హిందువునే.. నా పిల్లలు కూడా హిందువులే.. అని నమిత స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలో ఎన్నో ఆలయాలను సందర్శించాను.. కానీ ఎక్కడ నన్ను ఇలా సర్టిఫికెట్ చూపించమని అడగలేదు.. వీరి ప్రవర్తన నాకు తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది అని ఆవేదన చెందిన నమిత.. ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా దేవాదాయ శాఖకు కంప్లైంట్ కూడా చేశారు. మరోపక్క సిబ్బంది మా రూల్స్ ప్రకారం ఏం ప్రవర్తించామే తప్ప ఎవరితో పరుషంగా మేము ప్రవర్తించలేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు.