Begin typing your search above and press return to search.

పవర్ఫుల్ లీడర్ తో నమ్రత.. వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 9:16 AM GMT
పవర్ఫుల్ లీడర్ తో నమ్రత.. వైరల్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ యాక్టివిటీస్ లో కూడా భాగం అవుతున్నారు. అలాగే రెగ్యులర్ గా ఫ్యామిలీ సెలబ్రేషన్స్, వెకేషన్స్ కి సంబందించిన పిక్స్ కూడా నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ కూడా ఇన్ స్టాగ్రామ్ లో నమ్రతని ఫాలో అవుతారు.

ఎంబి ఫౌండేషన్ ద్వారా జరిగే సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని కూడా నమ్రత శిరోద్కర్ చూసుకుంటున్నారు. దాంతో పాటు ఏఎంబి ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా ఆమె హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో నమ్రత సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోవడంతో నమ్రత శిరోద్కర్ సోషల్ గా యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ వరదబాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షలు విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకొని 50 లక్షల చెక్కుని అందించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు నమ్రత శిరోద్కర్ కూడా పాల్గొన్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సీఎం ఆఫీస్ కి వచ్చిన సందర్భంగానే మంత్రి సీతక్కతో నమ్రత శిరోద్కర్ ఫోటోలు దిగారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సీతక్క, నమ్రత పక్కపక్కనే నిలబడి ఫోటోలకి ఫోజులిచ్చారు. ఇదిలా ఉంటే సీతక్కతో నమ్రత కొద్దిసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణతో పాటు ఏపీకి కూడా వరద బాధితుల సహాయార్ధం 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మహేష్ బాబు కలిసి విరాళం చెక్కు అందించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇక రేవంత్ రెడ్డికి చెక్కు ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా దిగిన ఫోటోలలో మహేష్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉంది. పొడవాటి జుట్టు, మీసంకట్టు, గడ్డంతో కనిపించరు. ఇలాంటి స్టైల్ లో మహేష్ బాబు ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించలేదు. రాజమౌళితో చేయబోయే SSMB29 సినిమా కోసం మహేష్ బాబు ఈ మేకోవర్ లోకి మారాడని తెలుస్తోంది. ఈ లుక్ బట్టి సినిమాపైనే ఫ్యాన్స్ నెక్స్ట్ లెవల్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు.