ఈవెంట్ ఏదైనా నమ్రత ఉండాల్సిందే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమత్ర శిరోద్కర్ ప్రతీ ఒక్కరితో మంచి అనుబంధాన్ని మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 24 Feb 2025 4:47 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమత్ర శిరోద్కర్ ప్రతీ ఒక్కరితో మంచి అనుబంధాన్ని మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ కు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా అందులో నమత్ర పార్టిసిపేషన్ తప్పనిసరి అయిపోయింది. మొన్నా మధ్య జరిగన వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి దగ్గర నుంచి తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో నమ్రత హైలైట్ అయింది.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ పెళ్లి రోజును ప్రైవేట్ జెట్ లో జరుపగా దానికి కూడా హాజరైంది నమ్రత. ఇక తాజాగా దుబాయ్ లో జరుగుతున్న ప్రైవేట్ వెడ్డింగ్ లో కూడా నమ్రత మెరిసింది. ఏ ఈవెంట్ కు అయినా ఆహ్వానం అందితే తప్పకుండా హాజరవుతూ ఉంటుంది నమ్రత.
మహేష్ ఎక్కడకు వెళ్లినా నీడలా ఉండే నమ్రత తమ సర్కిల్ లోని ప్రతి ఈవెంట్ కు వెళ్తూ అందరితో మంచి బాండింగ్ ను కొనసాగిస్తుంది. గతంలో మహేష్ బాబుతో కలిసి హాజరయ్యే నమ్రత ప్రస్తుతం మాత్రం తానొక్కటే ప్రతి ఈవెంట్ కు వెళ్తూ కనిపిస్తుంది. మహేష్ బాబు బయట కనిపించకపోవడం ఆయన ఫ్యాన్స్ కు నిరాశ కలిగించినా మహేష్ బాధ్యతని నమ్రత నిర్వర్తించడం చూసి అందరూ సంతోష పడుతున్నారు.
మహేష్ రియల్ లైఫ్ లో చాలా లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. దాన్ని నమ్రత బ్యాలెన్స్ చేస్తూ అందరితో కలిసి సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తూ మంచి పీఆర్ మెయిన్‌టెయిన్ చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి షూటింగ్ తో బిజీగా ఉండటం వల్లే మహేష్ బాబు ఏ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నాడు.
ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ కు మేకోవర్ అవుతున్న నేపథ్యంలో, రాజమౌళి ఆయన్ను ఎక్కడకూ పంపడం లేదు. ఇక మీదట చాలా సెలెక్టివ్ ఈవెంట్స్ లో మాత్రమే మహేష్ కనిపించనున్నాడు. అది కూడా రాజమౌళి పర్మిషన్ ఇస్తేనే. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.