సోలోగా నమ్రత..ఇన్ స్టాలో ఆట విడుపు
ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉన్నా! భారీ క్రేజ్ ఉన్నా ఆ ఫాలోయింగ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ఆలోచన ఎప్పుడూ నమ్రత చేయలేదు.
By: Tupaki Desk | 17 Oct 2023 10:06 AM GMTసూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రతాశిరోద్కర్ మంచి ఫ్యాషనిస్ట్. మహష్ జీవితంలోకి నమ్రత ప్రవేశించి నప్పటి నుంచి ఆయన జీవితం కొత్త టర్నింగ్ తీసుకుందని అంటుంటారు. ఆయన స్టైల్ ..లుక్ ఛేంజ్ వెనుక నమ్రత కీలక వ్యక్తిగా చెబుతుంటారు. ఇటీవలే మహేష్ సైతం ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఆయన ధరించే బట్టల విషయంలో సెలక్షన్ అంతా నమ్రతదే అన్నారు.
తాను ఎలాంటి డ్రెస్ లు తీసుకున్నా అందంగా..మరింత అందంగా మలుస్తాయని చెప్పకనే చెప్పారు. ఇంతవరకూ ఎవరికీ తెలియని సీక్రెట్ ఇది. సాధారణంగా ఎవరికి నచ్చిన బట్టలు వారు తీసుకుంటారు. ఒకరికొకరు ప్రేమతో కానుకలు ఇచ్చుకుంటారు. అది రేర్ గా. కానీ మహేష్ ధరించే ప్రతీ కాస్ట్యూమ్ వెనుక నమ్రత కీ రోల్ పోషిస్తారని మొన్నటితో క్లారిటీ వచ్చేసింది. మరి భర్తనే అంత అందంగా తయారు చేసిన నమ్రత..తానెంత అందంగా ముస్తాబవుతారో చెప్పాల్సిన పనిలేదు.
సింపుల్ వేర్స్ లోనే నమ్రత నేచురల్ లుక్ అలరిస్తుంటారు. తాజాగా నమ్రత కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో నమ్రత డిజైన్డ్ సారీలో మెరిసిపోతున్నారు. సారీ మ్యాచింగ్ బ్లౌజ్..చెవులీలు ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. నెక్ పై గ్రీన్ అండ్ వైట కాంబినేషన్ నెక్లస్ ధరించారు. కుమార్తె సితార నటించింది ఈ జ్యూవెలరీ యాడ్ లోనే.
అదే బ్రాండ్ నెక్లస్ ని ఇప్పుడు నమ్రత ధరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు లైకులు..కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. సాధారణంగా నమ్రత ఫోటోలు షేర్ చేయడం అన్నది చాలా రేర్. ఎక్కువగా కుటుంబంతో ఉన్న ఫోటోలే బయటకు వస్తుంటాయి. ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉన్నా! భారీ క్రేజ్ ఉన్నా ఆ ఫాలోయింగ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ఆలోచన ఎప్పుడూ నమ్రత చేయలేదు. కేవలం ప్రోఫెషనల్ గానే ఇస్టాన్ ని వినియోగిస్తున్నారు.