Begin typing your search above and press return to search.

మా హృద‌యాల్లో ఎప్ప‌టికీ ఉంటావ్! న‌మ్ర‌త‌

సెల‌బ్రిటీల ఇళ్ల‌లో పెంపుడు జంతువుల‌కు ఉండే ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు అంద‌రి ఇళ్ల‌లో ర‌క‌ర‌కాల మూగ జీవాలుంటాయి.

By:  Tupaki Desk   |   17 Aug 2023 10:43 AM GMT
మా హృద‌యాల్లో ఎప్ప‌టికీ ఉంటావ్! న‌మ్ర‌త‌
X

సెల‌బ్రిటీల ఇళ్ల‌లో పెంపుడు జంతువుల‌కు ఉండే ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు అంద‌రి ఇళ్ల‌లో ర‌క‌ర‌కాల మూగ జీవాలుంటాయి. వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో రైమ్ ఎంత ఫేమ‌స్..మ‌హేష్ ఇంట్లో ప్లూటో కూడా అంతే ఫేమ‌స్. చ‌ర‌ణ్ ఎక్క‌డుంటే రైమ్ అక్క‌డ ఉంటుంది. సితార ఎక్క‌డ ఉంటే ప్లూటో కూడా అక్క‌డ ఉంటుంది. అంతగా ప్లూటోని మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి ఇష్ట‌ప‌డుతుంది.

తాజాగా ప్లూటో మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తుంది. సోష‌ల్ మీడియాలో ప్లూటో పిక్ ని షేర్ చేస్తూ సితార బాధ‌ప‌డింది. `ఏడేళ్ల బంధం.. మిస్ యూ` అంటూ ప్లూటో పిక్ షేర్ చేసింది. ప్లూటో గురించి సితార చాలా సంద‌ర్భాల్లో పోస్ట్ లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. సితార అలా బాధ‌ప‌డ‌టం త‌ల్లి న‌మ్ర‌త చూడ‌లే క‌పోయారు. సితార‌ని ఓదార్చే ప్ర‌య‌త్నం చేసారు. `ప్లూటో ఎక్క‌డి వెళ్ల‌దు. మ‌నతోనే ఉంటుంది.

మ‌న ప్రేయ‌ర్స్ లో ఎప్ప‌టికీ నిలిచే ఉంటుందని` పోస్ట్ చేసారు. అలాగే `నిన్నుఎ ఎప్ప‌టికీ మిస్ అవుతూనే ఉంటాం. నువ్వు మా గుడెంల్లో ...ప్రార్ధ‌న‌ల్లో ఎప్ప‌టికీ ఉంటావ్` అంటూ న‌మ్ర‌త విచారం వ్య‌క్తం చేసారు. ప్లూటో మ‌ర‌ణంతో మ‌హేష్ అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. ప్లూటో బ్లాండ్ వైట్ కాంబినేష‌న్ రంగులో ఉంటుంది. చూడ‌టానికి ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఇదొక విదేశీ బ్రీడ్. మూగ జీవిలైన బాగా ద‌గ్గ‌రైన‌వి చ‌నిపోతే ఆ బాధ పెంచిన వారికే తెలుస్తుంది. మ‌రి ప్లూటో మ‌ర‌ణానికి కార‌ణం ఏంటో?

ఇక సితార ఇప్ప‌టికే బ్రాండింగ్స్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప్ర‌ఖ్యాత జ్యెయ‌ల‌రీ ని ప్ర‌మోట్ చేసింది. ఒళ్లంతా న‌గ‌లు ధ‌రించి సితార మెరిసిపోయింది. సితార‌ను యాడ్ లో అలా చూసుకుని న‌మ్ర‌త మురిసిపోయారు. మ‌హేష్ ఆనందానికి అవ‌దుల్లేవ్. కుమార్తె చూస్తుండ‌గానే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయిందంటూ సంతోష ప‌డ్డారు.