వేధింపుల ఆరోపణలపై మౌనం వీడిన నానా పటేకర్
అందరికీ నిజం తెలుసు'' అని అన్నారు. నాడు తన మౌనంపైనా వ్యాఖ్యానిస్తూ, ''అలాంటిదేమీ జరగని సమయంలో నేను ఏం చెప్పగలను? అకస్మాత్తుగా మీరు ఇది చేసారు..
By: Tupaki Desk | 24 Jun 2024 9:54 AM GMTమీటూ ఉద్యమంలో సీనియర్ నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు రావడం ఆ తర్వాత అతడు మౌనంగా ఉండిపోవడం తెలిసినవే. నటి తనుశ్రీ దత్తా కొన్నేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సెట్‌లో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించడం సంచలనం అయింది. ఆ తర్వాత తనూశ్రీ పరిశ్రమ నుండి నిష్క్రమించింది.. ఎందుకంటే ఆ ఘటన తనను మానసికంగా ప్రభావితం చేసిందని.. కానీ తాను పోరాడటానికి తిరిగి వచ్చానని తెలిపింది. అయితే సీనియర్ నటుడు నానా పటేకర్ తనూశ్రీ అన్ని ఆరోపణలను ఖండించాడు.
2018లో తనుశ్రీ ఆరోపణల అనంతరం దీనిపై అధికారుల విచారణ కొనసాగింది. ఆ సమయంలో నానా తనకు సంబంధించిన ఏదైనా చర్చించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తనూశ్రీ అతనికి ఎక్కువ ఛాన్సివ్వలేదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో నానా తనపై వచ్చిన ఆరోపణల గురించి ఓపెనయ్యాడు. ఇప్పుడు నానా లాలాంతోప్ మీడియాతో మాట్లాడుతూ తనుశ్రీ దత్తా వాదనలను ఖండించారు. అతడు మాట్లాడుతూ-''అదంతా అబద్ధమని నాకు తెలుసు.
అందుకే నాకు కోపం రాలేదు. అన్నీ అబద్ధాలే అయినప్పుడు నేనెందుకు కోపం తెచ్చుకోవాలి? ఈ ఆరోపణలన్నీ పాత విషయాలు. వాటి గురించి మనం ఏమి మాట్లాడగలం? అందరికీ నిజం తెలుసు'' అని అన్నారు. నాడు తన మౌనంపైనా వ్యాఖ్యానిస్తూ, ''అలాంటిదేమీ జరగని సమయంలో నేను ఏం చెప్పగలను? అకస్మాత్తుగా మీరు ఇది చేసారు.. ఇది చేసారు అని ఒకరు చెప్పారు. ఈ విషయాలన్నింటికీ నేను ఏం సమాధానం చెప్పాలి? నేను దీన్ని చేయలేదని చెప్పాలా?'' అని ప్రశ్నించారు. నేను ఏమీ చేయలేదన్న నిజం నాకు తెలుసు అని అన్నారు. మీ టూ ఆరోపణల కారణంగా నానా పటేకర్ హౌస్‌ఫుల్ 4 నుండి తొలగించబడిన 4 సంవత్సరాల తర్వాత నానా నుంచి ఈ ప్రకటన వచ్చింది.
ఈ రంగంలో నటీమణులు, మోడల్స్, యువ ప్రతిభావంతులను వేధించడానికి సినీ ప్రముఖులు తమ పొజిషన్ ను దుర్వినియోగం చేసినందుకు చాలా మంది నటీమణులు జరిగిన అన్యాయాలను బట్టబయలు చేసేందుకు బయటకు వచ్చారు.
బాలీవుడ్ లో నానా పటేకర్ తో పాటు సాజిద్ ఖాన్, రజత్ కపూర్, అలోక్ నాథ్ వంటి ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో మీ టూ ప్రభావం చివరికి తగ్గింది. కానీ ఆరోపణలు ఎదుర్కొన్న వారెవరికీ శిక్షలు పడకపోవడంతో నిరాశ ఎదురైంది. నటీమణులు ఆరోపణలను న్యాయ పోరాటంగా మార్చలేకపోయారు. కాబట్టి ప్రముఖులపై గుడ్డి సోషల్ మీడియా కథనాలతో హడావుడి తప్ప ఇంకేదీ కనిపించలేదు. ఏదీ నిరూపితం కాలేదు.