35 రూపాయల జీతంతో నటుడి జీవితం!
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 6 Jan 2024 1:30 PM GMTబాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. నటుడిగా తనకంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీని సంపాదించుకున్న నటు డాయన. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ పద్మ శ్రీ సహా ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్న నటుడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కెరీర్ కి సంబంధిం చిన కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ఆయన బాల్యం ఎలా గడిచింది? అన్నది ఆయన ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆవేంటో ఆయన మాటల్లోనే..
'ఈ మధ్య కాలంలో తండ్రి-పిల్లల మధ్య దూరం పెరుగుతుంది. మా చిన్నతనలో ఇలా ఉండేది కాదు. బయటకు ప్రేమ చూపించకపోయినా లోపల ఎంతో ప్రేమ దాచుకునే వాళ్లం. మా నాన్న మా కోసం కష్టపడు తున్నాడు? అన్న సంగతి మాకు అర్దమయ్యేది కాదు. మానాన్న వ్యాపారాన్ని ఎవరో లాక్కోవడంతో మేము దివాలా తీసాం. దీంతో ధనవంతుడైన మా నన్న రోడ్డున పడ్డాడు. దీంతో అతన్ని బాధ కమ్మేసింది.
శిక్ష పడిన ఖైదీలా కూర్చునేవాడు. అది చూసి నాన్నకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసాను. నువ్వు పోగొట్టు కుంది ఒక ప్యాక్టరీనే. ఇంకా నేను..అన్నయ్య అనే మరో రెండు ప్యాక్టరీలు ఉన్నాయని మర్చిపోకు. అంతా సర్దుకుంటుందని నచ్చ జెప్పాను. దీంతో 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలు పెట్టాను. నెలంతా పనిచేస్తే 35 రూపాయలు ఇచ్చి రోజులో ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రి తినేటప్పుడు అమ్మనాన్న గుర్తొచ్చినా? ఆకలికి తట్టుకోలేక నేను తినేసేవాడిని' అని అన్నారు.
ఇక ఆయన కెరీర్ లో తొలిసారి మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నటి తను శ్రీ దత్తా నానా పటేకర్ పై ఆరోపణలు చేయడంతో ఆయన కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న కొన్ని సినిమాలు సెట్స్ లో ఉన్నాయి.