Begin typing your search above and press return to search.

బాలయ్య.. ఏదైనా టాప్ లోనే..

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటే ఆయన అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు ఎవరైనా సరే పూనకాలతో ఊగిపోవాల్సిందే!

By:  Tupaki Desk   |   28 Oct 2024 2:49 PM GMT
బాలయ్య.. ఏదైనా టాప్ లోనే..
X

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటే ఆయన అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు ఎవరైనా సరే పూనకాలతో ఊగిపోవాల్సిందే! సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగారు. తనకంటూ ట్రేడ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా యాక్షన్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఆయన తప్ప కొన్ని రోల్స్ ఇంకెవరూ చేయలేరనే రేంజ్ లో దూసుకెళ్తున్నారు.

రీసెంట్ గా సినీ స్వర్ణోత్సవం జరుపుకున్నారు బాలయ్య. ఇప్పటి వరకు 108 చిత్రాలతో అలరించిన నట సింహం.. ఇప్పుడు NBK 109 మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో అదిరిపోయే రోల్ చేయనున్నారట. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఒకప్పుడు హిట్స్ కోసం కాస్త కలవరపడ్డ బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కేశారు. అప్పటి నుంచి బాలయ్య రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ వస్తోంది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్లు కొట్టేశారు. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటారని అభిమానులు స్ట్రాంగ్ గా చెబుతున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇక బాలయ్యకు టైమ్ ఇప్పుడు అద్భుతంగా ఉందని చెప్పాలి. సినిమాలతో పాటు అన్ని విషయాల్లో టాప్ గేర్ తో దూసుకెళ్తున్నారు నటసింహం. ఒక్కొక్కరి లైఫ్ లో ఓ దశ బాగుంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు బాలయ్య జీవితంలో మహర్దశ నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగతంగా, రాజకీయంగా, కుటుంబసభ్యుల పరంగా కూడా కలిసి వస్తోంది.

వ్యక్తిగతంగా చూసుకుంటే.. బాలయ్య బావ, వియ్యంకులు చంద్రబాబు నాయుడు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పెద్ద కూతురు బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీతో పాటు మరిన్ని వ్యాపారాలను చూసుకుంటున్నారు. చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారారు. ప్రస్తుతం మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నిర్మిస్తున్నారు. పెద్ద అల్లుడు నారా లోకేష్ ఎమ్మెల్యేగా.. చిన్న అల్లుడు శ్రీభరత్ ఎంపీగా సేవలందిస్తున్నారు.

బాలయ్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నడిపిస్తున్నారు. ఎందరో రోగులకు సహాయం చేస్తున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ లో స్టూడియోను నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు పద్మభూషణ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. రాజకీయ పరంగా, హిందూపురం ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికై సేవలందిస్తున్నారు. అలా అన్ని విషయాల్లో టాప్ స్టేజ్ లో ఉన్న బాలయ్యకు TUPAKI అభినందనలు చెబుతోంది.